Bhola Shankar : శివరాత్రి స్పెషల్.. చిరు భోళాశంకర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..

- Advertisement -

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. మొన్నీమధ్య సంక్రాతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. శివరాత్రి స్పెషల్ గా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందనడం లో సందేహం లేదు.. కాసేపటి క్రితేమే విడుదలైన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది..

Bhola shankar
Bhola shankar

మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్‌ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

Chirajeevi bhola shankar movie

ఇప్పటి వరకూ రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్‌ సినిమాకు సంబంధించి మేకర్స్‌ “స్ట్రీక్ ఆఫ్ శంకర్” పేరుతో గ్లింప్స్‌ను వదిలారు.. ఆ వీడియోలో చిరంజీవి లుక్ తో పాటుగా జై భోలో మహా శివ అనే ఆడియో వినిపిస్తుంది.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో చిరంజీవి సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మా సాంగ్ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో వచ్చిన సినిమాలతో ఈ సినిమా భిన్నంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here