Nandamuri Balakrishna : ఊరు మారితే..తినే ఫుడ్ మారుతుంది.. బెడ్ మారుతుంది.. బ్లడ్ ఎలా మారుతుంది బే బ్లడీ పూల్.. అన్న బాలయ్య కెరియర్ కూడా అలానే దూసుకుపోతోంది.. డైరెక్టర్ మారిన, కథ మారినా, కటౌట్ మారదు.. హిట్ అవ్వక మానదు అంటున్నారు నట సింహం నందమూరి బాలయ్య..ఆయన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. కొన్ని డ్తెలాగులు బాలయ్య కోసమే రాసారా అన్నట్టు ఉంటాయి. అందుకే ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తారు.
బాలయ్య తన కెరీర్‌లో ఇప్పటివరకు అఖండతో కలిపి 106 సినిమాల్లో నటించాడు. కెరీర్ ప్రారంభంలో తండ్రి ఎన్టీఆర్‌తో పాటు కలిసి ఎక్కువ సినిమాలు చేసిన బాలయ్య ఆ తర్వాత సోలో హీరోగా మారాడు.బాలయ్య నటించిన 106 సినిమాల్లో ఏకంగా 72సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డ్ ఏ హీరోకు లేదు. భవిష్యత్తులో కూడా ఏ హీరోకు ఈ రికార్డ్ దక్కుతుందన్న ఆశలు కూడా లేవు..హీరో నటించిన 72 సినిమాలు సెంచరీ కొట్టడం మాములు విషయం కాదు..ఇక ఆలస్యం ఎందుకు బాలయ్య నటించిన ఆ సినిమాలు ఏంటో ఒకసారి చుద్దాము..
మంగమ్మగారి మనవడు
ముద్దుల క్రిష్ణయ్య
సమరసింహారెడ్డి
నరసింహానాయుడు
సింహా
లెజెండ్
అఖండ
వీటితో పాటు కథానాయకుడు, రాము, లారీడ్రైవర్, రౌడీఇన్‌స్పెక్టర్ తదితర 10 సినిమాలు షిప్టింగులతో 25 వారాలు ఆడాయి.
ఒకే థియేటర్లో 200 ఆడిన సినిమాలు :
ముద్దుల క్రిష్ణయ్య
సమరసింహారెడ్డి
నరసింహానాయుడు
సింహా
లెజెండ్
స్వర్ణోత్సవ సినిమాలు:
మంగమ్మగారి మనవడు
ముద్దుల క్రిష్ణయ్య
ముద్దుల మావయ్య
సమరసింహారెడ్డి
నరసింహానాయుడు
లెజెండ్ ( డైరెక్ట్)
ప్లాటినం జూబ్లీ సినిమాలు..
మంగమ్మగారి మనవడు
లెజెండ్
ఈ సినిమాలన్నీ కూడా ఓ రేంజులో ఆడాయి..అన్ని సినిమాల తో పోలిస్తే లెజెండ్ మాత్రం బాలయ్య కెరియర్ ను మార్చింది..ప్రస్తుతం బాలయ్య రెండు మూడు ప్రాజెక్టుల లో నటిస్తున్నారు.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..అందుకే అంటారు..హిజ్ లెజండ్ అని..