Hansika Motwani Photos : యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి ఫొటోలు.. ఎంత అందంగా ఉందో..?

- Advertisement -

టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సికా మొత్వాని ( Hansika Motwani ) తన ప్రియుడు సోహైల్​తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. జైపుర్​లోని ఓ కోటలో గ్రాండ్​గా జరిగిన వేడుకలో.. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. హిందూ ఆచార సంప్రదాయాలతో వీరి పెళ్లి జరిగింది.

Hansika Motwani
Hansika Motwani Photos

ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథారియాతో ఈ దేశముదురు భామ లవ్​లో పడింది. పారిస్​లోని లవ్ స్పాట్ ఐఫిల్ టవర్ వద్ద సోహైల్ హన్సికకు గ్రాండ్​గా ప్రపోజ్ చేశాడు. సోహైల్​తో పెళ్లికి ఈ బ్యూటీ వెంటనే ఓకే చెప్పేసింది. ఆ తర్వాత రెండు కుటుంబాలు పెళ్లి పనులు చకాచకా చేసేశాయి.

Hansika and Sohail

జైపూర్​లోని ఓ రాజకోటలో దాదాపు నాలుగు రోజులుగా హన్సిక-సోహైల్ పెళ్లి వేడుక జరిగింది. మెహందీ, హల్దీ, సంగీత్, ప్రీ వెడ్డింగ్ బాష్, వివాహ వేడుక ఇలా గ్రాండ్​గా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

- Advertisement -
Hansika and Sohail

వివాహ వేడుకకు హన్సిక రెడ్‌ కలర్ లెహెంగాలో రెడీ అయింది. సిల్వర్, వైట్ కలర్ షెర్వానీలో సోహైల్ కలర్‌ఫుల్‌గా తయారయ్యాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Hansika and Sohail

నూతన వధూవరులు హన్సిక సోహైల్​ను వారి స్నేహితులు పల్లకిపై ఊరేగించారు. వారి చుట్టూ గ్రూప్​లా ఫామ్ అయి తెగ డ్యాన్సులు చేసేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి హన్సిక పెళ్లి కూతురిగా చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here