Nandamuri Balakrishna ప్రస్తుతం ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపుమీదున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చెయ్యబోతున్న సినిమాలన్నీ కూడా అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించేవే.నాసిరకపు డైరెక్టర్స్ తో చేస్తూ గతం లో తన మార్కెట్ ని మొత్తం పూర్తిగా పోగొట్టుకున్న బాలకృష్ణ ఇప్పుడు పూర్తిగా న్యూ ఏజ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుస హిట్స్ ని అందుకుంటూ దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం త్వరలోనే ఆయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.ఫిబ్రవరి లోనే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా తారకరత్న చనిపోవడం వల్ల వాయిదా పడింది.ఈ నెలాఖరున ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ చిత్రంలో కుర్ర హీరోయిన్ శ్రీలీల బాలయ్య బాబు కి కూతురిగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

బాలయ్య కెరీర్ లో సీమ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి కానీ, తెలంగాణ నేపథ్యం లో సాగే సినిమాలు మాత్రం లేవు.అందుకే అనిల్ రావిపూడి తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా బాలయ్య తో చెయ్యబోతున్నాడు.ఇందులో ఆయన తెలంగాణ యాసని మాట్లాడుతూ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నాడు.అదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో బాలయ్య 14 ఏళ్లకు పైగా జైలు శిక్షని అనుభవించి, 60 ఏళ్ళ వయస్సుకి బయటకి వచ్చిన వాడిగా కనిపించబోతున్నాడు.ఆయన లుక్స్ కూడా ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఉండబోతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జైలు సెట్టుని వేస్తున్నారు.అక్కడ బాలయ్య మీద సినిమాకి ఎంతో కీలకంగా మారే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు.అనిల్ రావిపూడి సినిమా అంటేనే ఆడియన్స్ కామెడీ ఆశిస్తారు.ఈ సినిమాలో కూడా కామెడీ ఉంటుంది కానీ , ఎక్కువ శాతం బాలయ్య మార్కు కనిపించే విధంగా మాస్ గా తెరకెక్కించబోతున్నాడట అనిల్ రావిపూడి.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ గురించి మరిన్ని అప్డేట్స్ బయటకి రానున్నాయి.