మహేషే అనుకుంటే నమ్రత కూడా ఆ విషయంలో అసలు తగ్గట్లేదుగా..

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత ఫ్యాషన్ జంటలలో ఒకరైన మహేష్ బాబు, నమ్రత ఇటీవల ఓ బేబీ షవర్ పార్టీకి హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు సంబంధించి పలు ఫొటోలను కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంలో వైరల్ కూడా అయ్యాయి. ఈ పార్టీలో నమ్రత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

నమ్రతా శిరోద్కర్
నమ్రతా శిరోద్కర్

సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నమ్రత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నమ్రతకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే తాజాగా మహేష్ బాబు నమ్రత సితార ముగ్గురు కలిసి ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయ భూపాల్ బేబీ షవర్ వేడుకలకు హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ బేబీ షవర్ వేడుకలలో మహేష్ నమ్రత దంపతులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

Namratha dress cost

అయితే ఈ వేడుకలలో భాగంగా నమ్రత ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. నమ్రత ఈ పార్టీలో ప్రత్యేకంగా ధరించిన కుర్తా ధరపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గ్రాఫిక్ డిజైన్ తో కూడిన ఈ కుర్తా ధర దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో నమ్రత లాంగ్ స్లీవ్ లు, మిడ్ లెంగ్త్ తో కూడిన సొగసైన సిల్క్ కుర్తాను ధరించారు. దాంతో పాటు స్ట్రెయిట్ హెయిర్, మినిమల్ మేకప్, డైమండ్ చెవి పోగులు ఆమె రూపాన్నే మార్చి వేశాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here