Kiara Advani : కియారా-సిద్​ల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇంకా దాచలేనంటూ బాలీవుడ్ బ్యూటీ పోస్ట్..!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సిక తన పెళ్లి పనుల్లో బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి.. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో హీరోయిన్​ కూడా వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు రెడీగా ఉందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

 

sidharth malhotra / kiara advani
sidharth malhotra / kiara advani

 

- Advertisement -

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తరచూ డిన్నర్‌ పార్టీలని, హాలీడే ట్రిప్‌లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే కాఫీ విత్‌ కరణ్‌ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా చెప్పారు సిద్-కియారాలు.

 

 

కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రాలు వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత ఉందో కానీ కియారా తాజాగా చేసిన ఓ ఇన్​స్టా పోస్టు చూస్తే మాత్రం ఇది నిజమేననిపిస్తోంది. పెళ్లి వార్తలకు ఆ వీడియో మరింత బలం చేకూరుస్తోంది. కియారా తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. కియారా అడ్వాణీ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానులను ఆటపట్టించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి ప్రకటన చేస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.

ఇన్‌స్టాలో కియారా వీడియో షేర్‌ చేస్తూ.. ‘ ఈ రహస్యాన్ని ఇంకా ఎక్కువ కాలం దాచలేను. త్వరలోనే ప్రకటిస్తున్నా. డిసెంబర్ 2న ప్రకటిస్తా. వేచి ఉండండి’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ అభిమాని సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి చేసుకుంటున్నారా? అని కామెంట్ చేయగా.. మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమేనా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి నటించిన గోవిందా నామ్ మేరా విడుదలకు సిద్ధమవుతోంది. గోవింద నామ్ మేరా డిసెంబర్ 16న ఓటీటీలో విడుదల కానుంది. ఆమె తర్వాత కార్తీక్ ఆర్యన్‌తో సత్యప్రేమ్ కి కథ, రామ్ చరణ్‌తో ఆర్‌సీ15 కనిపించనుంది.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here