నాగ చైతన్య ‘కస్టడీ’ ట్రైలర్ రివ్యూ..అక్కినేని ఫ్యామిలీ కి పూర్వ వైభవం వచ్చినట్టే!

- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’. తమిళం లో అపజయం అనేదే ఎరుగని టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కొత్త తరహా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని చూపించబోతున్నాం అని టీజర్ తోనే చెప్పేసాడు వెంకట్ ప్రభు.ఇక ఈరోజు కాసేపటి క్రితమే విడుదల చేసిన ట్రైలర్ తో ఏకంగా సినిమానే చూపించేసాడు.

కస్టడీ
కస్టడీ

ఈ చిత్రం లో తమిళ సీనియర్ హీరో అరవింద్ గో స్వామి విలన్ గా నటిస్తుండగా, మరో తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు.ఇక ఈ చిత్రం లో హీరోయిన్ కృతి శెట్టి నటించగా, ప్రముఖ హీరోయిన్ ప్రియమణి ఒక ముఖ్య పాత్ర పోషించింది.ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.

నాగ చైతన్య
నాగ చైతన్య

జాలి దయ ఏమాత్రం లేని ఒక నరహంతకుడిని పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకుంటారు.కానీ అతడు బయటకి తప్పించుకొని మరిన్ని హత్యలు చేస్తాడు, హీరో అతనిని మళ్ళీ పట్టుకొని చివరి వరకు పారిపోకుండా చేసి, కోర్టుకు అతనిని అప్పగించే ప్రయత్నం లో జరిగే పరిణామాలను డైరెక్టర్ ఈ చిత్రం లో చూపించినట్టు అర్థం అవుతుంది.ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ చిత్రం గా నిలవబోతుంది అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.

- Advertisement -

ప్రస్తుతం వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని తట్టుకుంటూ విసుగెత్తిపోయిన అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తప్పనిసరి.హీరో మరియు విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడిచేలా ఉండబోతుందట ఈ సినిమా.ట్రైలర్ తోనే భారీ హిట్ కొట్టబోతున్నాను అని సంకేతం ఇచ్చిన నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here