Guess the actor : ఈ ఫొటో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఈమె టాలీవుడ్ మరియు కొలీవుడ్ ని ఏలేస్తుంది!

- Advertisement -

Guess the actor : ఈ ఫోటో లో క్యూట్ గా టోపీ పెట్టుకొని కనిపిస్తున్న ఈమె ఎవరో గుర్తు పట్టారా..?, తమిళనాడు లో ఒక ప్రముఖ స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.కెరీర్ లో తొలుత హీరోయిన్ గా బాగానే రాణించింది కానీ, మధ్యలో ఆమె బాగా లావుగా తయారైంది.నెటిజెన్స్ అప్పట్లో ఆమె పెట్టే ఫోటోలకు నెగటివ్ కామెంట్స్ ని చూసి ఎంతో మనస్తాపానికి గురైంది.ఒకానొక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది.కానీ తల్లి తండ్రులు మరియు మిత్రుల ప్రోత్సాహం తో వర్కౌట్స్ చేసి నాజూగ్గా తయారై ఇండస్ట్రీ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈసారి హీరోయిన్ గా మాత్రం కాదు, లేడీ విలన్ గా కెరీర్ ని రీ స్టార్ట్ చేసింది.తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా లేడీ విలన్ రోల్స్ చేస్తూ సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న విలన్స్ లో ఒకరిగా మారిపోయింది.ఆమె మరెవరో కాదు, వరలక్ష్మి శరత్ కుమార్.

Guess the actor :
Guess the actor :

పైన లేడీ విలన్ అనగానే మీ అందరికీ అది వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మాట్లాడుతున్నాము అనే విషయం అర్థం అయిపోయి ఉంటుంది, ఆ రేంజ్ లో ఆమె ప్రేక్షకుల్లో తన ముద్ర వేసుకుంది.కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాదు,కథకి కీలకంగా మారే ఏ పవర్ ఫుల్ పాత్రని చెయ్యడానికి సిద్ధం అయ్యిపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్.వరలక్ష్మి ఛాయా మరియు శరత్ కుమార్ లకు పుట్టిన బిడ్డ.ఛాయా ని ప్రేమించి పెళ్లాడిన శరత్ కుమార్ కొనీళ్ళు కాపురం చేసిన తర్వాత విబేధాలు రావడం తో విడిపోవాల్సి వచ్చింది.

varalaxmi

ఆ తర్వాత శరత్ కుమార్ ప్రముఖ హీరోయిన్ రాధిక కి పెళ్లాడాడు.కానీ శరత్ కుమార్ కి వరలక్ష్మి అంటే ఎంతో ప్రేమ.ఈరోజు ఆమె సౌత్ లో ఇంత పాపులర్ అవ్వడానికి శరత్ కుమార్ చేసిన కృషి కూడా ఎంతో ఉంది.’పోదా పొడి ‘ అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా వరలక్ష్మి ఆ తర్వాత సుమారుగా పది సినిమాలకు పైగా హీరోయిన్ గా చేసింది.2018 వ సంవత్సరం లో విశాల్ హీరో గా నటించిన ‘పందెం కోడి 2 ‘ చిత్రం లో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక అప్పటి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, వరుసగా విలన్ రోల్స్ చేస్తూ లేడీ విలన్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయింది.ఆమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

sharath
varu
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here