సమంతతో విడాకులు.. శోభితతో డేటింగ్‌.. ఓపెన్‌ అయిన నాగ చైతన్య

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంతతో విడాకులు గురించి, శోభితతో డేటింగ్‌ గురించి చెప్పారు.

నాగ చైతన్య
నాగ చైతన్య

‘నా సినిమాల గురించి ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఓపిక పడతాను. కానీ, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే మాత్రం బాధపడతాను. అసలు సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగుతున్నారు. కేవలం హెడ్‌లైన్స్‌ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. నా కర్మ బాలేక కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం. కానీ, నాకు నా జీవితంలోని సమంతతో గడిపన రోజులు అంటే ఎంతో గౌరవం ఉంది. గత రెండేళ్లుగా మీడియాలో ఈ విషయంపై వస్తున్న రూమర్స్‌ వల్ల ఆ గౌరవాన్ని తీసేస్తున్నారు. ఇది నన్ను ఎంతగానో బాధిస్తుంది.

naga chaitanya sobhita dhulipala

మా ఇద్దరితో పాటు ప్రమేయం లేని మూడో వ్యక్తిని కూడా వార్తల్లోకి లాగుతున్నారు. వాళ్ల కుటుంబం ఎంత బాధపడుతుందని ఆలోచించడం లేదు. నేను, సమంత మా విడాకుల విషయం గురించి అందరికీ చెప్పాం. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేయండి. అది తప్ప మరో వార్త లేదా మీకు..? అని సీరీయస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమ గురించి వచ్చిన రూమర్స్ కారణంగానే ఇద్దరు మధ్య గొడవలు పెద్దవయ్యాయని ఆ గొడవల కారణంగానే విడాకులు తీసుకున్నమని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here