మెగా బ్రదర్ Naga Babu గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అడపాదడపా సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు.. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడు.. మరో వైపు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు.. తన సొంత యూట్యూబ్ ఛానెల్స్ లో ఎవరిమీదైనా కోపం ఉంటే కడిగి పడేస్తాడు… తాజాగా ఫిలిమ్ మేకర్స్ పై వరుస ట్వీట్స్ చేశారు.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..
సినిమాను ఎంత ప్రేమించినా అది ఒక బిజినెస్ అని ఆ రంగంలో ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటారు. కానీ అభిమానులు, కొంతమంది సినిమాలని తమ పర్సనల్ గా తీసుకొని సినిమాల్లో వచ్చేవాడిని అనుకరించడం, సినిమాల్లో చేసేవి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
మంచి పనులు చేస్తే పర్లేదు కానీ చెడ్డ పనులు కూడా చేసి సినిమాలని చూసి మోటివేట్ అయ్యాం అంటారు. దీంతో కొంతమంది సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు, జనాలు తప్పుదోవ పడుతున్నారు అంటూ వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్ పట్టుకొని విమర్శిస్తున్నారు.. దానిమీద మెగా బ్రదర్ వరుస ట్వీట్స్ కూడా చేస్తారు..
ఇప్పుడు చేసిన ట్విట్ లో సినిమాల్లో చూపించే వయోలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిలిం మేకర్ గా చెప్తున్నాను సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే. జనాన్ని బాగు చెయ్యటం కోసమో, చెడగొట్టాడానికోసమో తీసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ.
ఇది ఒక బిజినెస్ మాత్రమే. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే చూసుకోవడానికి సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి అంటూ ట్వీట్స్ చేశారు.. ఆ ట్విట్స్ కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోసారి నాగబాబు ట్రోల్స్ తో వార్తల్లో నిలిచాడు..