Nag Ashwin : బొమ్మలు పంపిస్తా ఆడుకో అంటూ అర్షద్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో స్పందించిన కల్కి డైరెక్టర్!

- Advertisement -

Nag Ashwin : ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ‘కల్కి’ చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ ని జోకర్ అంటూ సంబోధిస్తూ చేసిన కామెంట్స్ గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చకి దారి తీసిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. అతని వ్యాఖ్యలపై హీరో నాని, శర్వానంద్ తో పాటుగా నిర్మాత దిల్ రాజు కూడా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఖండించారు. దీనిపై కల్కి మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్ కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ టాలీవుడ్, బాలీవుడ్ కి ఎలాంటి వైరం లేదు. ఇప్పటికీ కూడా ఇండుస్త్రీలను ఇలా వేరు చేస్తూ చూడకండి. మనమంతా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళం. అంతా ఒకే ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళం. అర్షద్ తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించి మాట్లాడి ఉంటే బాగుండేది. అయిన మాకు అతని మీద అలాంటి కోపం లేదు. త్వరలోనే ఆయన పిల్లలు ఆదుకునేందుకు ‘కల్కి’ చిత్రంలోని బుజ్జి పాత్రకు సంబంధించిన బొమ్మలను పంపిస్తాం. కల్కి 2 కోసం ఇంకా కస్టపడి పని చేస్తాను. ప్రభాస్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించినంత శక్తివంతంగా చూపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ అశ్విన్.

Nag Ashwin
Nag Ashwin

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా థియేటర్స్ లో ఇన్ని రోజులు విజయవంతంగా రన్ అయిన కల్కి చిత్రం, ఇటీవలే ఓటీటీలో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కల్కి చిత్రం లోని కొన్ని షాట్స్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ నెటిజెన్స్ వివరిస్తున్న విధానాలు చూస్తే, ఈ చిత్రంలో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా అని ఆశ్చర్యపోక తప్పదు. అమెజాన్ ప్రైమ్ తో పాటుగా, ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో హిందీ లో తప్ప అన్నీ భాషలకు సంబంధించిన ఆడియో తో మనకి అందుబాటులో ఉంటుంది, కానీ హిందీ వెర్షన్ మాత్రం కేవలం నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ సినిమాని చూడకుండా ఎవరైనా ఉండుంటే వెంటనే చూసేయండి.

Kalki 2898 AD box office day 6: Prabhas, Amitabh Bachchan starrer continues to grow, collects Rs 370 crore

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here