Nabha Natesh : నేపాల్​ వెకేషన్​లో ఇస్మార్ట్ బ్యూటీ.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ స్టిల్స్

- Advertisement -

Nabha Natesh : కన్నడ బ్యూటీ నభా నటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ భామ సుధీర్ బాబుతో కలిసి నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ చిత్రం అంతగా సక్సెస్ కాలేదు.

Nabha Natesh
Nabha natesh

ఈ మూవీ తర్వాత నభా రామ్ పోతినేనితో కలిసి పూరీ జగన్నాథ్ డైరెక్షన్​లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సందడి చేసింది. ఈ మూవీలో అచ్చమైన తెలంగాణ పిల్లలాగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ చాందిని క్యారెక్టర్​లో అదరగొట్టింది. ఇస్మార్ట్ శంకర్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ పాపులారిటీ పొందిన నభా ఆ తర్వాత సినిమాలకు తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను నిజం చేసే క్రమంలో ఈ భామ కాస్త అతి చేయడంతో నిర్మాతలు ఈ బ్యూటీకి బైబై చెప్పి వేరే హీరోయిన్లను తీసుకునే వారు. దానివల్ల నభాకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

- Advertisement -
Nabha Natesh Stills

ఇక అడపాదడపా అవకాశాలు వచ్చాయి కానీ సరైన హిట్ మాత్రం ఒక్కటి రాలేదు. ఈ భామ తెలుగులో చివరగా మ్యాస్ట్రో సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు.ప్రస్తుతం నభా వెకేషన్ మూడ్​లో ఉంది. ఈ బ్యూటీ సమ్మర్ వెకేషన్​లో భాగంగా నేపాల్​ను చుట్టొస్తోంది. నేపాల్​లోని పోక్రా హిల్​టాప్​లో నభా జాలీగా గడుపుతోంది. బ్లాక్ కలర్ క్యాజువల్ ఔట్​ఫిట్​లో నభా ప్రకృతిలో పరవశించిపోతోంది.

Nabha Natesh Images

తన వెకేషన్​కు సంబంధించిన ఫొటోలను ఈ భామ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఫొటోల కింద కభీ కభీ మేరే దిల్ మే.. ఖయాల్ ఆతా హై అనే పాటలోని లిరిక్స్​ను క్యాప్షన్​గా జోడించింది. ఈ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో నభా బ్లాక్ డ్రెస్సులో కనిపించింది. బ్లాక్ ప్యాండ్ అండ్ టాప్​పైన బ్లూ కలర్ జాకెట్​తో కనిపించింది. జాకెట్​ను నడుముకు కట్టుకుని క్యాజువల్ లుక్​లో పోజులిచ్చింది. రా లుక్​లో నభా అదిరిపోయింది.

Nabha Natesh New Photos

నభా తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మేకప్​ లేకుండా కనిపించడంతో అభిమానులు సర్​ప్రైజ్ అవుతున్నారు. ఇస్మార్ట్ పిల్ల మేకప్ లేకపోయినా క్యూట్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అందం, అభినయం ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉంటేనే రాణించగలం.. నభాని చూస్తే అదృష్టం చాలా అవసరం అనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే నభా స్ట్రాంగ్ కమ్​బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here