సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. రోజురోజుకు అందాల అగ్గి రాజేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఈ భామ కూడా బోల్డ్ ఫొటోషూట్స్కు సై అంటూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. నెట్టింట సొగసుల విందు వడ్డిస్తూ మాయ చేస్తోంది.

తాజాగా మృణాల్ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భామ సాగరతీరాన తన సొగసులన్నీ వొలకబొస్తూ ఇచ్చిన పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ సాగరతీరాన బీచ్ హౌజ్లో జాలీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఇక ఆ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో మృణాల్ ట్రెండీ ఔట్ఫిట్లో కనిపించింది. తన వొంపులన్నీ ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ అందించింది. క్లీవేజ్ షోతో మతిపోగొట్టింది. మత్తెక్కించే చూపులతో గమ్మత్తైన పోజులతో వయ్యారాలు వొలకబోసింది. ప్రస్తుతం మృణాల్ ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.

మృణాల్ టాలీవుడ్లో సీతారామం సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో సీతగా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మృణాల్ చీరకట్టులో పద్ధతిగా కనిపించింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫొటోషూట్స్తో సర్ ప్రైజ్ చేస్తోంది. సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ భామకు టాలీవుడ్లో అవకాశాలు వరుస కట్టాయి. ఈ భామ నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. షూటింగ్ కూడా మొదలైంది.

మరోవైపు మృణాల్ బాలీవుడ్లోనూ దూసుకెళ్తోంది. టెలివిజన్ నటిగా ప్రస్థానం ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ నెమ్మది గా బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అలా తన టాలెంట్తో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సౌత్, నార్త.. ఇలా రెండు ఇండస్ట్రీల్లో తన సత్తా చాటుతోంది.