Mr. Bachchan : ‘ధమాకా’ చిత్రం తర్వాత మాస్ మహారాజా రవితేజ చేసిన నాలుగు చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కొత్త డైరెక్టర్స్ ని నమ్మడం వల్లే ఆయనకి ఇలా ఫ్లాప్స్ వస్తున్నాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ‘ఈగల్’, ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ, రివ్యూస్ పరంగా పర్వాలేదు అనే రేంజ్ అనిపించుకున్నాయి. కానీ ఎన్నో అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. రివ్యూస్ కూడా దారుణంగా వచ్చాయి. హరీష్ శంకర్ – రవితేజ కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మిరపకాయ్’ చిత్రం ఆ రేంజ్ హిట్ కాబట్టి.
ఎంత ఫ్లాప్ టాక్ వచ్చిన ఓపెనింగ్స్ బాగా వస్తాయని అనుకున్నారు. కానీ ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా అన్నీ ప్రాంతాలలో రన్నింగ్ ముగింపు దశకి వచ్చేసిందని, ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కేవలం 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయని. కానీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రవితేజ సినిమాలకు జరిగిన బిజినెస్ కంటే ఈ చిత్రానికి జరిగిన డిజిటల్ బిజినెస్ చాలా తక్కువకి జరిగిందట.
కేవలం పది కోట్ల రూపాయలకు మాత్రమే నెట్ ఫ్లిక్స్ సంస్థ రైట్స్ ని కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ చిత్రం మరో వారం లోపు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకునే అవకాశం నిర్మాత కలిపిస్తే, మరో 5 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని ఒక ఆఫర్ ఇచ్చిందట. అసలే నష్టాల్లో ఉన్నాము, బంగారం లాంటి అవకాశం వచ్చింది అన్నట్టుగా భావించి నిర్మాత విశ్వ ప్రసాద్ ఆ డీల్ కి ఒప్పుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. రెండు రోజుల్లో ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన బయట రానుంది. మరి థియేటర్ ఆడియన్స్ ని అలరించలేకపోయిన ఈ సినిమా, కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా ఆదరిస్తుందో లేదో చూడలే.