కామెడీ జానర్ సినిమాలకు ట్రేడ్ మార్కు లాగ ఉండే హీరో అల్లరి నరేష్.మొదటి సినిమా నుండి ఆయన కామెడీ సినిమాలతోనే తన కెరీర్ ని నెట్టుకొచ్చాడు. అలనాటి స్టార్ హీరో రాజేంద్ర ప్రసాద్ మన టాలీవుడ్ లో కామెడీ జానర్ సినిమాలకు ఒక బ్రాండ్ లాగ ఎలా అయితే ఉండేవాడో, అల్లరి నరేష్ కూడా నేటి తరానికి అలాంటి హీరో అయ్యాడు.
అయితే మధ్య మధ్యలో ఈయన ‘గమ్యం’, ‘నేను’ , ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ లాంటి విభిన్నమైన సినిమాలు చేసి, తాను కామెడీ మాత్రమే కాదు, అన్నీ రకాల పాత్రలను కూడా చెయ్యగలను అని నిరూపించుకున్నాడు.ఇప్పుడు అయితే మనం ‘నాంది’ సినిమా నుండి అల్లరి నరేష్ 2.O ని చూస్తున్నాం అనే చెప్పాలి. కామెడీ జానర్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, సీరియస్ సినిమాలే వరుసగా చేస్తూ వస్తున్నాడు.ఆ క్రమం లోనే ఆయన ‘ఉగ్రం’ అనే సినిమా చేసాడు.
ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ లో అల్లరి నరేష్ కి పెట్టిన ఫైట్స్, రీసెంట్ సమయాల్లో స్టార్ హీరోలకు కూడా డైరెక్టర్స్ పెట్టలేకపొయ్యారు అనే చెప్పాలి.అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని అల్లరి నరేష్ ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది మిత్రులకు మరియు మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేశారు.ఈ సినిమా చూసిన వారంతా అల్లరి నరేష్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు.
అనవసరంగా ఇన్ని రోజులు కామెడీ సినిమాలు చేసావు కానీ, ఇలాంటి సబ్జక్ట్స్ కెరీర్ ప్రారంభం నుండి ఎంచుకొని ఉండుంటే పెద్ద మాస్ హీరో అయ్యేవాడివని అన్నారట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తన భార్య పిల్లలతో పాటుగా సిటీ లో కనిపించకుండా పోయిన ఆడవాళ్ళూ మరియు వారి పిల్లలను వెతికి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ ఇందులో కనిపించబోతున్నాడు. ప్రతీ సన్నివేశం తర్వాత ఏమి జరగబోతుంది అనే థ్రిల్ ని ఆడియన్స్ లో కలిగించే విషయం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడట. మరి పబ్లిక్ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.