ఈ భూ ప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదనే చెప్పాలి.. తొమ్మిది నెలలు మోసి కనడం మాత్రమే కాదు.. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.. ఆ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈరోజు మదర్స్ డే సందర్బంగా జనాల హృదయాలను గెలుచుకున్న సినిమాలు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ..
1993లో వచ్చిన మాతృదేవోభవ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతోంది. ముఖ్యంగా చిత్రంలోని వేటూరి రచించిన ‘రాలిపోయే పువ్వా’ సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులు, తెలుగు ఆడియెన్స్ మదిలోనే పదిలంగా ఉంది. భారీ రెస్పాన్స్ దక్కింది. దాంతో మలయాళం, హిందీలో రీమేక్ అయ్యింది. చిత్రానికి కే అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించారు.. ఈ సినిమాను ఇప్పుడు చూసిన కన్నీళ్లు వస్తాయి.. అంతలా ఆకట్టుకుంది..
1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యమలీలా’ చిత్రం ఇప్పటి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. అలీ, మంజు భార్గవి తల్లికొడుకుల పాత్రలో కన్నీరు పెట్టించారు. చిత్రంలో ఇంద్రజ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. అలీకి ఇది తొలిచిత్రం. మూవీలోని ‘సిరులొలికించే’ సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులకు ఫేవరేట్ గానే ఉంది.. అలాగే అమ్మానాన్న ఓ తమిళమ్మాయి.. సినిమా కూడా అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన సినిమానే..
రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘ఛత్రిపతి’లోనూ మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. తల్లి కోసం ప్రభాస్ పడే ఆరాటం అందరినీ కదిలిస్తుంది. సీనియర్ నటి భానుప్రియ తల్లిపాత్రలో జీవించిపోయారు. అందుకే ఇప్పటికీ సినిమాను మరిపోలేరు.. ఇక ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ కూడా తల్లిప్రేమను ఎంతో చక్కగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. అమలా అక్కినేని తల్లిపాత్రలో అద్భుతంగా నటించారు. తన నటనతో ఆడియెన్స్ తో కంటతడి పెట్టించారు. 2012లో విడుదలైంది. అభిజిత్, సుధాకర్ కొమకుల, శ్రియా శరన్, విజయ్ దేవరకొండ కీలక నటించారు..
తమిళ స్టార్ ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలోనూ మదర్ సెంటిమెంట్ ప్రేక్షకుల హ్రుదయాలను కదిలిస్తోంది. ధనుష్ కు తల్లిపాత్రలో శరన్య జీవించారు. ఇప్పటకీ సోషల్ మీడియాలో మూవీ సీన్స్ వైరల్ గా కనిపిస్తుంటాయి. తల్లిప్రేమను చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. కేజీఎఫ్, బిక్షగాడు సినిమాలు కూడా తల్లి సెంటిమెంట్ తో వచ్చినవే..