‘మంత్ ఆఫ్ మధు’ సినిమాలో అన్ని అలాంటి సీన్లు ఉంటాయా.. అందుకే సీక్రెట్ స్క్రీనింగ్ అని చెబుతున్నారా!

- Advertisement -
Community-verified icon

Colours Swathi : ఒక హోస్ట్‌గా సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించింది కలర్స్ స్వాతి. ఆ ప్రోగ్రామ్ పేరు కలర్స్ కావడంతో ఇప్పటికీ చాలామందికి తను కలర్స్ స్వాతిగానే గుర్తుండిపోయింది. వెండితెరపై హీరోయిన్‌గా ఎంటర్ అయిన తర్వాత వెంటవెంటనే సినిమాలు చేయాలని స్వాతి ఏమీ తొందరపడలేదు. అందుకే ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటుంది.

చాలాకాలం తర్వాత స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది టీమ్. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రపంచమంతా ఆ సినిమాను చూసే ముందే సీక్రెట్ స్క్రీనింగ్స్ పేరుతో కొంతమందికి ప్రత్యేకంగా స్క్రీనింగ్స్‌ను ఏర్పాటు చేస్తోంది మూవీ టీమ్.

అక్టోబర్ 5 సాయంత్రం కేవలం హైదరాబాద్, వైజాగ్‌లో మాత్రమే ఈ స్క్రీనింగ్స్ జరగనున్నాయి. ‘మీరు ప్రేమించిన వారితో కలిసి ఈ నిజమయిన ప్రేమకథను ఆస్వాదించండి’ అంటూ మూవీ టీమ్.. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ గురించి బయటపెట్టింది. కాకపోతే ‘మంత్ ఆఫ్ మధు’ స్పెషల్ స్క్రీనింగ్స్‌లో పాల్గొనాలంటే ఒక ఫార్మ్‌ను నింపాల్సి ఉంటుంది. ఈ ఫార్మ్ లింక్‌ను స్వాతి సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here