Honey Rose : నక్క తోక తొక్కిన బాలయ్య మరదలు.. ఏకంగా పవర్ స్టార్ తో రొమాన్స్ చేసే ఛాన్స్

- Advertisement -


Honey Rose : అప్పుడెప్పుడో శివాజీ సరసన ఆలయం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ హనీరోజ్. అసలు ఆ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియదు. దీంతో అమ్మడంటే అప్పట్లో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నందమూరి బాలకృష్ణతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ముద్దగుమ్మ హనీరోజ్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ బాలయ్యతో ఆడిపాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలి పాత్రలో నటించి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు విశేష ప్రాధాన్యం లభించింది.

Honey Rose
Honey Rose

35ఏళ్లకు చేరువవుతున్నా ముద్దుగుమ్మ తన అందచందాలతో తెలుగు కుర్రకారు మతిపోగోడుతుంది. వీరసింహారెడ్డి సినిమాలో నటించిన తర్వాత హనీ రోజ్ కు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ మేజర్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల ఎంపికైంది. ఇక మరో కీలక పాత్రకు హనీ రోజ్ ను దర్శకుడు హరీశంకర్ ఎంపిక చేశారని టాక్. హనీ అనగానే బోల్డ్ క్యారెక్టర్ అనుకుంటారు.. కానీ పవన్ సినిమాలో ఆమె చాలా సిన్సియర్ రోల్ చేస్తుందట. పవన్ పక్కన హనీ రోజ్ ఛాన్స్ వచ్చిందంటే అమ్మడి దశ తిరిగినట్లే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here