Mohan Babu : అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందిన వెళ్లలేకపోతున్న మోహన్ బాబు.. కారణం ఇదే..!
Mohan Babu : హిందువుల ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రామమందిర నిర్మాణం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమాల నేపథ్యంలో రామ మందిర ట్రస్ట్ ఇప్పటికే పలువురు సీనియర్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు ఆహ్వాన పత్రికను అందించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులందరికీ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు రావాలంటూ ఆహ్వానం అందింది. అయితే ఈ కార్యక్రమానికి మోహన్ బాబును ఆహ్వానించారా లేదా అనే సందేహం చాలా మందికి ఉంది. తాజాగా ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందిందనట్లు ప్రకటించారు. మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా ప్రత్యేక భద్రత కల్పిస్తామని చెప్పారట.

కానీ మేమే భయపడి ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తాను అయోధ్యకు వెళ్లకున్నా.. ఈ నెల 14 నుంచి 22 వరకు ఇక్కడ దేవుడి సన్నిధిలో పలు పూజా కార్యక్రమాలు చేస్తున్నామని మోహన్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య ప్రారంభోత్సవ వేడుకకు వెళ్లేందుకు మోహన్ బాబు అంతగా భయపడుతున్న విషయం ఏంటంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.