Anushka: డాడీ సినిమాలో చిన్నారి ఐశ్వర్య ఇప్పుడు ఎంత అందగత్తె చూడండి.!

Chiranjeevi Daddy Fame child artist Anushka Malhotra latest photos viral


Anushka: మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో చిరంజీవి కూతురు ఐశ్వర్య పాత్రలో కనిపించిన ఆ చిన్నారి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ సినిమాలో ఐశ్వర్య, అక్షయ అంటూ డ్యూయల్ రోల్ లో కనిపించింది ఈ చిన్నారి.. అక్కి డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్.. అంటూ వాళ్ళిద్దరూ ఆడిన ఆటలు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి.. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. కానీ తండ్రి కూతురుని ఎంత బాగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో చిరు ని చూస్తే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.. డాడీ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..

 Anushka Malhotra
Anushka Malhotra

డాడీ సినిమాలో నటించిన చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా.. ఈ సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . ఈ సినిమా తరువాత ఈ చిన్నారికి బాలీవుడ్లో వరుస ఆఫర్లు క్యు కట్టాయి . టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవకాశాలను అందుకుంది. ఆ తరువాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటూ పై చదువుల పై దృష్టి సారించింది.

Chiranjeevi Daddy Fame child artist Anushka Malhotra latest photos viral

చిన్నారి అనుష్క మల్హోత్రా ఇప్పుడు పెరిగి పెద్దదైంది.. లండన్ లో చదువు పూర్తి చేసి అక్కడే మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించింది. వాస్తవానికి అనుష్క తన ఫ్యాషన్ ను ఫాలో అవుతుంది.. ఒకప్పుడు ఇంట్లో వాళ్ల కోసం సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతోంది. ఈ అమ్మడు అందానికి హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసుకొని గ్లామర్ ఈ అమ్మడు సొంతం. కానీ సినిమా ఆఫర్లు ఎప్పుడు మన ఇంటి తలుపు తడతాయో చెప్పలేం.. అదే ఉద్యోగం అయితే జీవితాంతం మన వెన్నంటే ఉంటుంది. ఇక అదే ఫార్ములాను ఫాలో అవుతుంది అనుష్క మల్హోత్రా..

Chiranjeevi Daddy Fame child artist Anushka Malhotra latest photos viral

అందుకే ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే నిత్యామీనన్ , కీర్తి సురేష్ . ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. కాగా అనూష అనుష్క మల్హోత్రా ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . తన చిన్నప్పటి ఫోటోలు ప్రస్తుత ఫోటోలను జాయిన్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.