Jyotirai : సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న జగతి ఆంటీ అశ్లీల ఫొటోలు, వీడియోలు!

- Advertisement -

Jyotirai : బుల్లితెర నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ నటి అయిన పలు సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సీరియల్లో మేల్ లీడ్ రిషి పాత్రకు తల్లిగా జగతి మేడమ్ క్యారెక్టర్ లో జ్యోతి జీవించింది. ఇందులో చీర కట్టు, బొట్టులో సంప్రదాయంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడీ సీరియల్లో ఆమె పాత్రను చనిపోయినట్లుగా చూపించారు. ఇందులో ఎంతో పద్ధతిగా కనిపించే జ్యోతి.. సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. పలు మోడ్రన్ డ్రెస్‌లు ధరించి హాట్ పిక్స్‌తో నెట్టింట రచ్చ చేస్తుంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియోలు లీకయ్యాయని, వాటిని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామంటూ జ్యోతికి సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలను కొందరు నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు.

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియో లీక్ ల ఉదంతం మరచిపోక ముందే జ్యోతి రాయ్ వీడియోలంటూ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. కర్ణాటకలోని హసన్ లోక్‌సభ స్థానం ఎంపీయే ఈ ప్రజ్వల్ రేవణ్ణ. ఈ మధ్యే ఆయనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆ రాష్ట్రంలో రచ్చరచ్చ అవుతోంది. తాజాగా జ్యోతి రాయ్ వీడియోలూ లీకవడంతో అసలు ఏం జరుగుతోందంటూ సోషల్ మీడియోలో చర్చ మొదలైంది. ఇది ఇలా ఉంటే జ్యోతి రాయ్ యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్‌ను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక అప్పటినుంచి జ్యోతిరాయ్ కన్నడలో సీరియల్స్ చేస్తూ పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల గుప్పెడంత మనసు సీరియల్ క్యారెక్టర్ కూడా ముగియడంతో.. తెలుగు ప్రేక్షకులకు కనిపించడం మానేసింది. తాజాగా జ్యోతిరాయ్‌కు సంబంధించిన అశ్లీల ఫొటోలు, EDIT BY ABHI అనే అకౌంట్ నుంచి పోస్ట్ అవడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్‌లో 1000 మంది సబ్‌స్క్రైబర్లు కాగానే అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

జ్యోతి రాయ్ చీరలో అందంగా ముస్తాబై ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో తమ దగ్గర ఉందని టీజ్ చేస్తూ అందులోని స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేశారు. అలాగే ఇందులో తన భర్తతో కలిసి ఓ పార్టీలో రెచ్చిపోయి లిప్‌లాక్ ఇచ్చిన ఫొటో కూడా ఉంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు ఫ్యాన్స్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో, ఫొటోల్లో ఉన్నది జ్యోతిరాయేనా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here