Guess The Actor : ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తెలుసా?

- Advertisement -

Guess The Actor : టాలీవుడ్ లో బాలనటులుగా ఇండస్ట్రీ కి వచ్చి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ కుటుంబీకులు చైల్డ్ ఆర్టిస్ట్స్ గా ఇండస్ట్రీ కి వచ్చి నేడు సౌత్ లో క్రేజీ స్టార్స్ గా మారిపోయారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.వారిలో బేబీ షాలిని తమిళనాడు లో టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత అజిత్ ని పెళ్లాడింది.

Guess The Actor
Guess The Actor

ఇక ఆమె చెల్లెలు షామిలి కూడా టాలీవుడ్ కి ‘ఓయ్’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వీళ్లిద్దరి గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా బాగా తెలుసు కానీ, వీళ్ళ అన్నయ్య కూడా ఒక క్రేజీ హీరో అనే విషయం మాత్రం ఎవ్వరికి తెలియదు. అతను మరెవరో కాదు, ‘ఏ ఫిలిం బై అరవింద్’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ దగ్గరైన రిచర్డ్ రిషి.

rishi shalini shamili

ఇతను షాలిని మరియు షామిలి కి సొంత అన్నయ్య అవుతాడు.ఈయన తన చెల్లెలు ఇద్దరితో కలిసి బాలనటులుగా మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో నటిస్తాడు.ఈ సినిమాలో చిరంజీవి మరియు శ్రీదేవి కి ఎంత గొప్ప పేరొచ్చిందో బాలనటుగా చేసిన ఈ ముగ్గురికి కూడా అంతే పేరు వచ్చింది.ఈ సినిమా తర్వాత రిషి తన చిన్న చెల్లెలు షామిలి తో ‘అంజలి’ అనే సినిమా చేసాడు.

- Advertisement -
Rishi

ఈ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. చెల్లెల్లు ఇద్దరు పెద్దయ్యాక హీరోయిన్స్ అవ్వగా, రిషి హీరో గా స్థిరపడ్డాడు. తెలుగు మరియు తమిళం బాషలలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించాడు. అయితే ఎక్కువగా ఆయన తెలుగు కంటే తమిళం లో సినిమాలు చేసాడు. 2021 వ సంవత్సరం వరకు సినిమాలు చేసుకుంటూ వచ్చిన రిషి ప్రస్తుతం సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చాడు. ఆయన లేటెస్ట్ ఫోటో ని క్రింద మీ కోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here