పవన్ కళ్యాణ్ ని ఇంటి నుండి గెంటేసిన డాక్టర్.. నా తమ్ముడిని అవమానిస్తావా అంటూ రెచ్చిపోయిన మెగాస్టార్ చిరంజీవి!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు మరియు ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ప్రారంభం లో ఈ సినిమా మీద రీమేక్ కారణంగా చాలా నెగటివ్ అంచనాలు అభిమానుల్లో ఉండేవి.

చిరంజీవి
చిరంజీవి

ఇప్పుడు ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మొత్తం పోయాయి. కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొడుతామనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో అంగరంగ వైభవవంగా జరిగింది. ఈ చిత్రం లో పని చేసిన ప్రతీ ఒక్కరూ చిరంజీవి గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాదు ఈ ఈవెంట్ కి అతిథులుగా విచ్చేసిన వారిలో ఒకరు డైరెక్టర్ బాబీ చిరంజీవి,పవన్ కళ్యాణ్ విషయం లో ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక ఇంట్లో సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నాడట. అది డాక్టర్ ఇల్లు,ఆ డాక్టర్ ప్రతీ దానికి ఎదో ఒక అడ్డు చెప్తూ ఉండేవాడట. ఒకరోజు యూనిట్ సభ్యులు నడుస్తుండగా ఆ డాక్టర్ కి కోపం వచ్చి, ఏమి మనుషులయ్యా మీరు చెప్పులు వేసుకొని అలా నడుస్తున్నారు అని అన్నాడట. అప్పుడే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి, అదేంటండీ, ముందుగా అన్నీ మాట్లాడుకొనే కదా డబ్బులు ఇచ్చాము,షూటింగ్ అన్న తర్వాత చెప్పులు వేసుకోకుండా ఎలా తిరుగుతారు అని అనగా, అప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నేను షూటింగ్ చెయ్యను అండీ వెళ్ళిపోతున్నాను అని కోపంగా వెళ్ళిపోయాడట.

- Advertisement -

ఈ విషయం చిరంజీవి కి ఎవరో నిర్మాత ద్వారా తెలిసింది అట. వెంటనే ఆ డాక్టర్ కి ఫోన్ చేసి, నా తమ్ముడిని బయటకి వెళ్ళమండానికి నువ్వు ఎవడివి రా, నువ్వెంత నీ ఇల్లేంత, షూటింగ్స్ కి ఇవ్వడం ఇష్టం లేకపోతే తాళం వేసుకొని ఇంట్లో కూర్చో, అంతే కానీ ఇలాంటి చిల్లర లెక్కలు చెయ్యకు, నా తమ్ముడు అలిగి వెళ్లిపోయి గంట అయ్యింది కాబట్టి ఊరుకుంటున్న, ముందే తెలిసి ఉంటే అక్కడికే వచ్చి షూటింగ్ చేయించేవాడిని అని అన్నాడట. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన బాబీ మాట్లాడిన ఈ మాటలు కనిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here