Gang Leader Sequel : సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్ ప్రోమో

- Advertisement -

Gang Leader Sequel : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి,వాటిల్లో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలలో ఒకటి ‘గ్యాంగ్ లీడర్’..విజయ బాపినీడు దర్శకత్వం లో తెరెకెక్కిన ఈ చిత్రం 1991 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలై ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Gang Leader Sequel
Gang Leader Sequel

అలాంటి బ్లాక్ బస్టర్ కి త్వరలోనే సీక్వెల్ రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని విశ్వనీయ వర్గాలు. ఈ చిత్రానికి డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ వ్యవహరిస్తాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపిస్తుంది. ఈమధ్యనే మెగాస్టార్ ని కలిసి కథని వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా రప్పించుకున్నాడట పూరి జగన్నాథ్. కథ మొత్తం విన్న తర్వాత కొన్ని కీలక మార్పులు చెయ్యమని సూచించాడట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Puri Jagannadh Chiranjeevi

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ పూరి జగన్నాథ్ తోనే జరగాల్సి ఉంది.. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ లో ‘ఆటో జానీ’ అనే చిత్రం తెరకెక్కబోతుంది అనే వార్తలు కూడా జోరుగా ప్రచారం సాగాయి. ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ నచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ సరిగా వర్కౌట్ కాకపోవడం తో ఆ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.. ఇప్పుడు పూరి జగన్నాథ్ ‘లైగర్’ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల తదుపరి చిత్రం ఎలా అయినా గట్టిగా కొట్టాలనే కసితో ఉన్నాడు. దానికి తగట్టు గానే స్క్రిప్ట్ ని చాలా పకడ్బందీగా సిద్ధం చేసాడట.

- Advertisement -

గ్యాంగ్ లీడర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంత ప్రత్యేకంగా నిలిచిందో, ఈ సీక్వెల్ కూడా అంతకు మించి ఉండబోతున్నట్టు సమాచారం..ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రం లో ‘గ్యాంగ్ లీడర్’ థీమ్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు ఎంత నచ్చిందో తెలిసిందే. ఈరోజు ఆ ప్రోమో ని విడుదల చెయ్యగా ఫ్యాన్స్ నుండి అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది, ఆ ప్రోమో ని మీరు కూడా క్రింద చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here