Devi Sri Prasad : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ గురించి అందరికి తెలుసు..ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు.. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు.. సింగర్, యాంకర్ ,యాక్టర్ గా కనిపించారు. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు దేవి.. ఇప్పుడు దేవి కూడా వర్మ బాటలో పయనిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు సినిమాపై ఆయన డెడికేషన్ ఎలా ఉండేదో. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద సినిమాలు చేస్తూ వివాదాల డైరెక్టర్ గా మారిపోయారు. అంతేకాదు స్టార్ సెలబ్రిటీలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు..
ఇప్పుడు వర్మ కు, దేవికి వున్న సంబంధం ఏంటా? అని ఆలోచిస్తున్నారు కదూ..ఆగండి..ఆగండి..దేవి కూడా వర్మ లాగే మొదట్లో ఆనందం సినిమాతో అందరి నోళ్ళలో మెదిలేలా పేరు సంపాదించుకున్నారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించి ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన మ్యూజిక్ సినిమాకు బ్యాక్ బోన్ అనే చెప్పాలి..ఈయన అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉండటంతో చాలా మంది ఫాలొవర్స్ కూడా వున్నారు..
ఇకపోతే ఈ మధ్య ఈయన అందించే మ్యూజిక్ ఏ మాత్రం బాగా లేకుండా పేలవమైన ఔట్ పుట్ వస్తుందంటూ చాలామంది శ్రోతలు అంటున్నారు. అంతే కాదు ఈ మధ్యకాలంలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఉప్పెన, పుష్ప సినిమాలు మ్యూజిక్ పరంగా మంచి హీట్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ఏ సినిమాకు కూడా ఈయన అందించిన మ్యూజిక్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదని టాక్.. అందుకు కొన్ని సినిమాలే ఉదాహరణ.. ఇకపోతే హీరోయిన్లతో ఎఫైర్ కు ఆయన కెరీర్ పై దెబ్బ వేసింది..
ప్రస్తుతం దేవీ మ్యూజిక్ అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా మ్యూజిక్ అంతగా బాగాలేదు అంటూ ఇప్పటికే ఆయనపై ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి.. ఇది చిరు కు మైనస్ అయ్యేలా ఉందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతేకాదు వాల్తేరు వీరయ్య కి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ కాపీ అంటూ నెట్టింట్లో చాలా వార్తలు గుప్పుమంటున్నాయి.. ఇక ఈ నేపద్యంలోనే ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్ పై నెగిటివిటీ పెరిగింది. దాంతో దేవిశ్రీప్రసాద్ పని ఇండస్ట్రీలో అయిపోయింది..ఇక మ్యుజిక్ కు పనికి రాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేక పోలేదు..చిరు సినిమా తర్వాత మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు..చూడాలి మరి..