Varun Dhawan : స్ట్రెయిట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ లోకి బాలీవుడ్ స్టార్ ఎంట్రీ

- Advertisement -

Varun Dhawan : టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కొద్దో గొప్పో సినిమాలు చేసి పేరు సంపాదించడం ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని కలగనడం. ఒకప్పుడు కొందరు హీరోయిన్లు ఇలాగే భావించేవారు. అలా టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్లి అక్కడ సక్సెస్ అవ్వలేక ఇక్కడ ఆఫర్లు రాక తెరపై కనుమరుగయ్యారు కొందరు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. తెలుగు సినిమా స్టైల్ మారింది. కంటెంట్ ఉన్న సినిమాలతో.. టాలెంట్ తో టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ భారత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు తెలుగు నటులు. అందుకే ఇక్కడి హీరో హీరోయిన్లకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్ కమ్ చెబుతోంది. 

Varun Dhawan
Varun Dhawan

బాహుబలి, కేజీఎఫ్, కాంతార, ఆర్ఆర్ఆర్ హవాతో హిందీ ఇండస్ట్రీకి సౌత్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు అక్కడి సినిమాలు కూడా సౌత్ భాషల్లో డబ్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. అలా సౌత్ ఇండియన్ ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాలని బాలీవుడ్ చాలా ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఓ బాలీవుడ్ హీరో తన సినిమాను తెలుగులో డబ్ చేసి మరీ రిలీజ్ చేశాడు. ఇక్కడి తెలుగు ఆడియెన్స్ ప్రేమ, రెస్పాన్స్ చూసి తను కూడా తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందాలనుకున్నాడు. అందుకే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. మరి ఆ హీరో ఎవరు.. ఆ సంగతేంటో చూద్దామా…

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ రీసెంట్ గా భేడియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాని తెలుగులో తోడేలు గా రిలీజ్ చేశాడు. తెలుగు సినిమాలు వరుసగా బాలీవుడ్ లో డబ్ అయ్యి రిలీజ్ అవుతుండగా ఈ క్రమంలో అక్కడ సినిమాలు కూడా తెలుగులో డబ్ చేసి ఇక్కడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తోడేలు తెలుగులో అంతగా ప్రభావం చూపించకపోయినా ఆ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ హైదరాబాద్ రావడం ఇక్కడ ఆడియన్స్ ని మీట్ అవ్వడం సందడిగా జరిగింది.

- Advertisement -

తోడేలు సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. అందుకే ఆ మూవీ కోసం ఇక్కడ ఓ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ టైం లోనే గీతా ఆర్ట్స్ లో వరుణ్ ధావన్ తో ఓ సినిమా ఉంటుందని చెప్పారు. వరుణ్ ధావన్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచాడు. గీతా ఆర్ట్స్ లోనే వరుణ్ ధావన్ తెలుగు సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే ఈ సినిమాపై చర్చలు మొదలు పెట్టారట. ఈ విషయాన్ని వరుణ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

త్వరలో ఒక తెలుగు మూవీ చేయబోతున్నానని.. దానికి సంబందించిన విషయాలు కొద్దిరోజుల్లో తెలియచేస్తామని అన్నాడు. తెలుగు హిందీ భాషల్లో కలిసి వచ్చేలా ఆ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకీ వరుణ్ ధావన్ తో చేసే సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

వరుణ్ ధావన్ ని తెలుగులో గట్టిగా ప్రమోట్ చేయనున్నాడు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇక మీదట హిందీలో కూడా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. తెలుగు మార్కెట్ పై కన్నేసిన బాలీవుడ్ హీరోలని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న గీతా ఆర్ట్స్ వారి సినిమాలను హిందీలో మార్కెట్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here