Ustaad : మన తెలుగులో మీమ్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే కమెడియన్ మన బ్రహ్మీ..బ్రహ్మానందం. ఇక బ్రహ్మీ కంటే దాదాపుగా ఎక్కువగా మీమ్స్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే మాస్ మహారాజ్ రవితేజ అనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో వచ్చిన పలు సినిమా కామెడీ అంతాఇంతా కాదు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా విక్రమార్కుడు.. అల్లుడు నువ్వు తగ్గద్దు అంటూ రవితేతో బ్రహ్మీ చేసిన కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించాయి. ఇక వెంకీ మూవీలో ట్రైన్ జరిగే సన్నివేశం అయితే ఆ మూవీకే హైలెట్ అనే చెప్పాలి. అయితే అప్పటి వీరిద్దరి కాంబినేషన్స్ లో వచ్చిన సన్నివేశాలు ఇప్పుడు ఎవర్గ్రీన్ మీమ్స్ రూపంలో వినోదాన్ని పంచుతున్నాయి. ఇక ఇలాంటి వినోదాత్మక మీమ్స్ క్రియేట్ చేసే మీమర్లపై మాస్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను మీమ్స్‌ని చాలా ఆస్వాదిస్తాను, మీమర్స్ చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. మీమర్స్ కు ఇలా చేయాలే థాట్ ఎలా వస్తుందో తెలయదు కానీ.. ఇలా మీమ్స్ రూపంలో కూడా ఎదుటి వారిని నవ్వు తెప్పించ వచ్చు అనే ఆలోచనకు వస్తుంది చూడండి.. ఆ.. ఆలోచనకు హాట్స్ ఆఫ్ అబ్బా.. అంటూ చిరునవ్వు నవుతూ అప్పటి బ్రహ్మీతో చేసిన కామెడీని గుర్తుచేసుకున్నారు. హీరో మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ అనే టాక్ షోలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి మీమ్‌ని ఆస్వాదిస్తానని చెప్పాడు. అదే సమయంలో, మాస్ మహారాజ్ నవ్వుతూ.. ‘నేనింతే’ మూవీలోని తన డైలాగ్ ‘ఏంటి సార్ అదీ’ అనే క్లిప్ ను షోలో ప్లే చేయడంతో.. ఇదే ఇలాంటివే చూసి ఆనందిస్తానని మీమ్స్‌పై మాస్ మహరాజ్ తెలిపారు. ఎంతో సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో తమపై వచ్చిన మీమ్స్ ను స్ర్కీన్ పై చూసి అస్సలు సీరియస్ అవకుండా ఎంజాయ్ చేయాలి కానీ.. సీరియస్ ఎందుకు అంటూ రవితేజ సమాధానం ఇచ్చారు. తనపై వస్తు్న్న మీమ్స్ ను కొట్టిపడేయడంతో ఆ.. ఎపిసోడ్ నవ్వుతూ అలా సాగిపోయింది.