Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజకు పిచ్చి.. చాలామందికి తెలియదు.. ఈ వార్త చదివితే ఇట్టే అర్థమవుతది

- Advertisement -


Ravi Teja : అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కమెడియన్ గా.. ఆ తర్వాత హీరోగా ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో‎గా ఎదిగారు రవితేజ. ఈ పేరు గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా రవితేజ చాలా స్పెషల్. దానికి కారణం కష్టానికి మరో మారుపేరే. చిరంజీవి తర్వాత అలాంటి ఓ క్రేజ్ అందుకున్న హీరో కేవలం రవితేజనే కావడం గమనార్హం. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి కచ్చితంగా నాలుగుకు తగ్గకుండా సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటారు.

tiger nageshwar rao
tiger nageshwar rao

మిగతా హీరోలు నాన్నలు, తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ చిరంజీవి తర్వాత రవితేజ, నాని మాత్రమే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. కాగా రీసెంట్ గా రవితేజ నటించిన ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ ఆయన తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈగల్ ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ విషయం తెలిసిన మాస్ మహారాజ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోలు అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండాలని.. అది మా రవితేజకు తన రక్తంలోనే ఉందని ఈగల్‎ని పోస్ట్ పోన్ చేసుకోవడమే కాకుండా తన మూవీతో పోటీపడుతున్న హనుమాన్ కు ఎలాంటి ఈగో లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో మంచి విషయం అంటున్నారు. మాస్ మహారాజా ది గోల్డెన్ హార్ట్ అంటూ పోగిడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రవితేజ పోస్టర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here