Pawan Kalyan : పవన్‌ స్పెషల్ ప్రోమో.. చూడాలంటే శివరాత్రి వరకు ఆగాల్సిందేనా..

- Advertisement -

Pawan Kalyan : హరి హర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హృద్యమైన చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన తాజా పాన్ ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరించిన ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ గ్రాండ్ లెవల్లో జరుగుతోందని మేకర్స్ నిన్న ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Pawan Kalyan
Pawan Kalyan

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను కూడా విడుదల చేయనున్నట్లు వారు తమ ప్రకటనలో తెలిపారు. ఇంతకీ విషయం ఏంటంటే.. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ స్పెషల్ ప్రోమోను విడుదల చేయనున్నారనేది తాజాగా టాలీవుడ్ బజ్. అని ప్రోమోలో ప్రకటించారు. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ రావాల్సి ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదంతా విన్న అభిమానులు మాత్రం పవన్‌ స్పెషల్‌ ప్రొమో చూడాలంటే మహా శివరాత్రి వరకు ఆగాల్సిందేనా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరైతే.. మహా శివరాత్రికి హరిహర వీరమల్లు ప్రొమో మమూలుగా ఉండదేమో అంటున్నారు. ఏదైతేనేమీ స్పెషల్‌ ప్రొమో కోసం మేకర్స్ క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ.. ఒకవేళ వస్తే ఎప్పుడా.. అనే రీతిలో పవన్‌ ఫ్యాన్‌ వైటింగ్‌ లో వున్నారు.

కాగా..పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ 17వ శతాబ్దం నాటి పీరియాడికల్ డ్రామా. ఇందులో పవన్ హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. హాలీవుడ్ బేస్డ్ VFX , యానిమేషన్ నిర్మాత బెన్ లాక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ దర్శకులు కూడా పనిచేస్తున్నారు. 2021లో ఈ సినిమా బడ్జెట్ రూ. 150 కోట్లు. అయితే ఇప్పుడు రూ.200 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. మరి ఇంత భారీ హైప్ ఉన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here