అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాకి అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు అనడంలో సందేహం లేదు. కేవలం ఆకకిఎన్ని అభిమానులే కాకుండా వేరే హీరోల అభిమానులకు ఎంతో మందికి ఈ సినిమా నచ్చుతుంది. కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా సోనాలీ బింద్రే, అన్షు అంబానీ నటించారు. ఈ మూవీ తోనే టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అన్షు. ఈ సినిమాలో తన నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని పొందింది.

ఇక ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమా లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేదు. మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. కాగా లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది అన్షు. తనకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. ఇక సోషల్ మీడియాతో అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం అక్కడే ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తుందట. అక్కడ ఆమెకు ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాపు కూడా ఉందని తెలుస్తుంది.

కాగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది అన్షు. తన ఫ్యామిలీ ఫొటోస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా అన్షు షేర్ చేసిన ఒక ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే.. అన్షు షేర్ చేసిన ఫొటోలో వినాయక విగ్రహం వద్ద చెప్పులు వేసుకుని ఆమె ఉండడమే. ఈ మేరకు దేవుడి దగ్గర చెప్పులు వేసుకోవడమేంటి.. అంటూ నెటిజన్లు అన్షు ని ట్రోల్ చేస్తున్నారు.