ముద్దు కావాలన్న ఫ్యాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మాళవిక మోహన్..

- Advertisement -

మాళవిక మోహన్ .. ఈ అమ్మడు తెలుగులో నటించినప్పటికీ ఇక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల్లో కావలసినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది.. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది.. తాజాగా, ఆమె ఆస్క్‌మాళవిక చేపట్టారు.. ఈ సందర్బంగా ఓ ఫ్యాన్ ఆమెను ఓ ప్రశ్న అడిగడంతో షాక్ అయ్యింది.. ఆ తర్వాత ఆమె ఆన్సర్ ఇవ్వడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

మాళవిక మోహన్
మాళవిక మోహన్

ఈ అమ్మడు పేట సినిమాతో తెలుగు తెరకు పరిచయం.. రజినీకాంత్ సినిమా కావడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయాయి.. ఆశించిన ఫలితాలను అందించలేదు..ఆ తర్వాత దళపతి విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్‌’ సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాళవిక తెలుగులో ఏ సినిమా చేయకపోయినా కూడా వేరే బాషా సినిమాలు డబ్ కావడంతో పాపులర్ అయ్యింది…

malavika mohanan

ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో ‘ఆస్క్ మాళవిక’ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్‌ ఆమెను ఓ ముద్దు అడిగాడు. మీరు నాకో ముద్దు ఇస్తారా?’ అని అడిగాడు. ఇందుకు మాళవిక స్పందిస్తూ.. ఇది మీ డీపీలోని.. ఎంతో అందంగా ఉన్న పిల్లి కోసం అంటూ ఓ ముద్దు సింబల్‌ను పెట్టారు. తర్వాత చాలా మంది ఫ్యాన్స్‌ ఆమెను అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చారు… ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరు ఆమె సమాధానం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.. ప్రస్తుతం తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మాళవిక 2020లో మసబా మసబా అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు… ఇప్పుడు కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here