నెగటివ్ పబ్లిసిటీ తో బంపర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న ‘మళ్ళీ పెళ్లి’.. అదృష్టం అంటే ఇదే!

- Advertisement -

ఇటీవల కాలం లో మీడియా లో మరియు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన వృద్ధ జంట నరేష్ మరియు పవిత్ర. వీళ్లిద్దరు డేటింగ్ చేసుకోవడం, పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం , మధ్యలో నరేష్ మూడవ భార్య రమ్య చేసిన రచ్చ, ఇదంతా తెలుగు ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు. అంత చిరాకు కలిగించేసారి వీళ్లిద్దరు, అయితే తమపై వచ్చిన నెగటివ్ పబ్లిసిటీ ని కమర్షియల్ గా వాడుకుంటూ నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా తీసి నేడు గ్రాండ్ గా విడుదల చేసాడు.

మళ్ళీ పెళ్లి

వీళ్ళ సోది జనాలు ఎక్కడ చూస్తారులే అని అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో మంచి ఓపెనింగ్ దక్కింది. రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలకంటే కూడా డీసెంట్ ఆక్యుపెన్సీలను నమోదు చేసి ట్రేడ్ కి షాక్ ఇచ్చింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది. నరేష్ – పవిత్ర మీద జనాలకు కలిగిన విరక్తి ని చూసి ఇంత ఓపెనింగ్స్ వస్తాయని ముందుగా ఎవ్వరూ ఊహించలేకపోయారు. దీనిని బట్టీ చూస్తే జనాలకు వివాదాల మీద ప్రత్యేక ఆసక్తి ఉంది అనే విషయం అర్థం అవుతుంది.

- Advertisement -

ఈ చిత్రాన్ని నరేష్ 15 కోట్ల రూపాయిలను ఖర్చు చేసి తీశానని మీడియా ముందు చెప్పుకున్నాడు. కానీ ఈ చిత్రానికి అయిన ఖర్చు కేవలం 8 కోట్ల రూపాయిలు మాత్రమేనట.ఇది కేవలం డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ద్వారానే వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. థియేట్రికల్ నుండి వచ్చే కలెక్షన్స్ మొత్తం బోనస్ అట. ఇలా నెగటివిటీ ని బాగా ఉపయోగించుకొని కమర్షియల్ గా నరేష్ బాగా సంపాదించాడని.అదృష్టం అంటే ఇదే అని అంటున్నారు నెటిజెన్స్.

.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here