Kriti Shetty: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న బేబమ్మ.. అందుకేనా..?

- Advertisement -

కొందరు కథానాయికలు ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా స్టార్ స్టేటస్ దక్కించుకోలేరు. మరికొందరేమో డెబ్యూ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు. ఇంకొందరు కేవలం ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకులను తమవైపు తిప్పేసుకుంటారు. వీడసలు ముసలాడవకూడదే అంటూ ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కన్నడ భామ Kriti Shetty తెలుగు ప్రేక్షకుల ఉప్పెనంత ప్రేమను సొంతం చేసుకుంది. రోజుకో హీరోయిన్ పరిచయమవుతున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ డెబ్యూ మూవీతోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది.

ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు సూపర్ బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుందని.. ఈ భామ మరో సమంత అవుతుందని అనుకున్నారంతా. కానీ బంగార్రాజు తర్వాత ఈ బ్యూటీకి మరో హిట్ సినిమా లేదు. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా వరుసగా ఫ్లాప్‌లొచ్చి పడ్డాయి. సినీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ వచ్చినా హీరోయిన్ కెరీర్ రిస్క్‌లో పడినట్లే. అలాంటిది వరసుగా మూడు ఫ్లాప్‌లు ఇచ్చిన బేబమ్మను ప్రస్తుతం ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఇందులో కృతి తప్పేం లేదు. తన వరకు తన పాత్రకు మించిన కష్టపడుతూ చక్కగా అభినయిస్తోంది.

Kriti Shetty
Kriti Shetty

అయినా ఈ కన్నడ బ్యూటీని సినిమాల్లోకి తీసుకునేందుకు చాలా వరకు దర్శకులు, హీరోలు సంశయిస్తున్నారు. దీనికి కారణం ఆమె వయస్సు. కృతి వయస్సు 19 ఏళ్లు మాత్రమే. స్టార్ హీరోలు దాదాపు 40 ఏళ్లకు దగ్గరలో ఉన్నారు. వాళ్ల పక్కన కృతి చిన్నపిల్లలా కనిపిస్తోంది. కానీ ఇండస్ట్రీలో ఒక రేంజ్‌కు చేరుకోవాలంటే స్టార్‌ హీరోలతో తప్పక పనిచేయాల్సిందే. అదేమో కృతికి వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే స్ట్రెస్ తీసుకోకుండా ఈ బ్యూటీ కొన్నాళ్లు సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటుందట.

- Advertisement -

తన దగ్గరికి మరో సూపర్ హిట్ సినిమా వచ్చే వరకు ఎలాంటి మూవీ చేయొద్దని ఫిక్స్ అయిందట. ప్రస్తుతం ఈ భామ నాగచైతన్య-వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న ఓ మూవీలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ్‌లో సూర్య, మలయాళంలో మరో సినిమా చేస్తోంది. ఈ మూవీల తర్వాత ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేస్తుందట. అయితే నాగచైతన్యతో ఇంతకుముందే ఓ సూపర్ హిట్‌ మూవీలో నటించింది కృతి. మరి ఈసారి కూడా ఆ హిట్ రిపీట్ అయితే కృతి తన డెసిషన్ మార్చుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here