సైలెంట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మహేష్ విట్టా

- Advertisement -

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు మహేశ్ విట్ట. తనదైన శైలి స్లాంగ్ కామెడీ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్ బాస్ షో ద్వారా మరింత మందికి చేరువై… ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు పొందుతున్నాడు. మహేష్ విట్టా.. మొదట యూట్యూబ్ లో ఫన్ బకెట్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో.. బుల్లితెర పైన కనిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా పొద్దుటూరు ప్రాంతంలో మహేశ్ విట్టా జన్మించారు. ఈయన ఎక్కువగా రాయలసీమ స్లాంగ్ లోనే మాట్లాడుతూ ఉంటారు.

మహేష్ విట్టా
మహేష్ విట్టా

బిగ్ బాస్ -3 లో పాల్గొని ప్రేక్షకులకు చేరువైన మహేష్ విట్టా తాజాగా తాను ప్రేమించిన తను శ్రావణి రెడ్డిని పెళ్లాడారు. పొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ లో వీరి పెళ్లి జరిగింది. అనంతరం మహేష్ విట్టా, శ్రావణి పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఉండంగానే తన మహేష్ తన ప్రేమకథను వివరించారు. కానీ అప్పట్లో ఆమె పేరు మాత్రం బయటికి చెప్పలేదు. మహేశ్ శ్రావణి రెడ్డిని సుమారుగా ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పారు. ఆమె మరెవరో కాదు మహేష్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ అని తెలుస్తోంది.

తను ప్రపోజ్ చేసిన టైంలో మొదట్లో రిజెక్ట్ చేసిన ఆ తర్వాత ఆమెను ఒప్పించి మరి శ్రావణి ప్రేమను సాధించుకున్నట్లు మహేశ్ తెలిపాడు. రెండేళ్లుగా స్నేహం చేసి తర్వాతనే శ్రావణి తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నాడు. శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుండగా మహేశ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ – శ్రావణి రెడ్డి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here