Mahesh – Trivikram ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ఉంటుంది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించి దాదాపుగా ఏడాది దాటింది,కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.ఏప్రిల్ నెలాఖరు లోపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసి, ఆగష్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

మహేష్ కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న సినిమా ఇదే అని ఫిలిం నగర్ లో ఒక టాక్ కూడా ఉంది.పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అభిమానులను తీవ్రమైన నిరాశకి కి గురి చేస్తుంది.మహేష్ – త్రివిక్రమ్ మూవీ అంటే అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎన్నో ఊహించుకుంటారు.

ఎంటర్టైన్మెంట్ , ఫామిలీ డ్రామా , ఎమోషన్స్ మరియు ఫైట్స్ ఇలా అన్నీ ఒక ప్యాకేజి గా కోరుకుంటాము.కానీ ఇప్పుడు తెరకెక్కబోయ్యే సినిమా మాత్రం కేవలం ఫ్యామిలీ డ్రామా మాత్రమేనట, ఫైట్స్ అసలు ఉండవట, సినిమా మొత్తం ఒక ఇంటి చుట్టూనే తిరుగుతుందట.అత్తారింటికి దారేది నుండి మొన్న వచ్చిన ‘అలా వైకుంఠపురం లో’ వరకు త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి, ఇప్పుడు మళ్ళీ అదే ఫార్మటులో అంటే ఫ్యాన్స్ కి కూడా చిరాకు కలుగుతాది.

పైన చెప్పిన సినిమాలన్నీ కమర్షియల్ ఎలెమెంట్స్ మొత్తం ఒక ప్యాకేజి లాగ ఉంటుంది, అందుకే ఆ సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి.కానీ ఇక్కడ మాత్రం కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు సిస్టర్ సెంటిమెంట్ తో ఉంటుందట.మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న సినిమాలో ఫైట్స్ లేకపోతే డిజాస్టర్ ఫ్లాప్ అని ఇప్పటి నుండే డిసైడ్ అయిపోతున్నాం అంటూ మహేష్ ఫ్యాన్స్ ట్వీటర్ ట్వీట్స్ వేస్తున్నారు.