మహేష్ – రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ఆగష్టు 9న అధికారిక ప్రకటన!

- Advertisement -

#RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనుల్లో రాజమౌళి ఫుల్ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది లోనే పూర్తి కానుంది, సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జనవరి 13 వ తారీఖున విడుదల కాబోతుంది.

మహేష్ - రాజమౌళి
మహేష్ – రాజమౌళి

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా ఆగష్టు 9 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి తో చెయ్యబొయ్యే సినిమా పూజ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకి చేరుకుంది, ఈ నెలలోనే ప్రారంభిద్దాం అనుకున్నారు కానీ, మహేష్ పుట్టిన రోజు అయితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశ్యం తో ఆగష్టు 9 వ తారీఖున పూజా కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కాన్సెప్ట్ ని తెలిపే విధంగా ఒక వీడియో ని కూడా సిద్ధం చేయించాడట డైరెక్టర్ రాజమౌళి.

- Advertisement -

ఇది కూడా ఆరోజే విడుదల చెయ్యబోతున్నట్టు,టైటిల్ కూడా అదే రోజు ప్రకటిస్తారని తెలుస్తుంది. #RRR సినిమాలాగానే, ఈ చిత్రానికి కూడా మూడు ఇంగ్లీష్ అక్షరాలా టైటిల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇదే టైటిల్ అన్నీ బాషలలో కామన్ గా ఉండబోతుందట. తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు కాన్సెప్ట్ మొత్తాన్నీ అభిమానులకు తెలియచేసే అలవాటు ఉన్న రాజమౌళి, ఈ సినిమాకి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పబోతున్నాడట. #RRR చిత్రం తో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ తో ఎన్ని అద్భుతాలు సృష్టించబోతున్నాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here