Surekha : ఆ పనిచేస్తూ తల్లికి అడ్డంగా దొరికిపోయిన సుప్రీత.. మరీ గారాభం చేస్తే ఇలాగే అవుతారు సురేఖ

- Advertisement -

Surekha : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో అక్క, వదిన, అమ్మ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆమె గత కొంత కాలంగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సురేఖ తన కూతురు సుప్రీతను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అమర్‌దీప్ చౌదరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో సుప్రీత హీరోయిన్‌గా కనిపించనుంది. రీసెంట్‌గా ఈ సినిమా ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ నేపథ్యంలో అమర్, సుప్రీత కలిసి ఓ టాక్ షోకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న దావత్ షోలో వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఈ షోలో రీతు కొంచెం పచ్చి బూతు ప్రశ్నలతో.. తన గెస్ట్‌ల‌ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయ‌త్నిస్తుంది. అలా అమర్, సుప్రీతలను కూడా కిక్ కోసం, క్రాక్ లో, బలుపుతో చేసిన పనులు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. అయితే దీనికి సుప్రీత సమాధానమిస్తూ.. కిక్‌ల కోసం అయితే మా అమ్మ 15, 16 ఏళ్ల వయసులో లైసెన్స్ లేకుండా కారు తీసుకుని బయటకు వెళ్లేదని.. అప్పుడు నన్ను మా అమ్మ చితకబాదిందని సుప్రీత వివరించింది.

- Advertisement -

అది కాకుండా ఇంకా కిక్కు కోసం ఏం పనులు చేసావో చెప్పమంటూ రీతూ అడగ్గా.. స్కూల్ డేస్ లో నా ఫ్రెండ్స్ కి స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాలని ఉండేది.. ఒక రోజు అమ్మకు తెలియకుండా ఓ మందు బాటిల్ తీసుకెళ్లి స్కూల్లో అందరికీ తాగించేసా.. అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ విషయం మా కో ఆర్డినేటర్‌కి తెలిసిందని ఆమె వివరించింది. ఇక క్రాక్ లో చేసిన పనులు అయితే నేను ఇష్టపడిన అబ్బాయిని ఎవరైనా అమ్మాయి చూస్తే వెంటనే అమ్మాయిని వెళ్లి కొట్టేదాన్ని అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో వామ్మో ఈ పిల్ల మహా ముదురే.. ఆ ఏజ్ లోనే అలాంటి పనులు చేసి దొరికిపోయిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here