మహేష్ మాములోడు కాదుగా దుబాయ్ లో విల్లా.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి

- Advertisement -

భార్య పిల్లలతో ఊ అంటే… ఫారెన్ టూర్ వెళ్లే మహేష్.. అందులోనూ.. దుబాయ్‌ అంటే.. కాస్త ఇష్టపడుతుంటారు. కనీసం ఇయర్సో ఓ టూ టైమ్స్ అయినా.. దుబాయ్‌కే వెళుతుంటారు. అంతేకాదు.. తనకు ఇష్టమైన వన్‌ ఆఫ్ ది హాలీడే స్పాట్ దుబాయ్ అని కూడా చాలా సందర్బాల్లో చెప్పారు. ఇక అందుకే అన్నట్టు.. తాజాగా తనకిష్టమైన దుబాయ్‌లోనే.. ఓ కాస్ట్లీ విల్లాను కొన్నారనే న్యూస్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు మహేష్. ఎస్ ! ఇండియాకు దుబాయ్ కాస్త దగ్గర్లో ఉండడం.. తన వైఫ్‌ నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా దుబాయ్‌లో సెటిల్ అవ్వడంతో… దుబాయ్‌లోనే మహేష్ కూడా తన ఫ్యామిలీ కోసం ఓ కాస్ట్లీ విల్లా తీసుకున్నారట.

మహేష్
మహేష్

హాలీడే దొరికనప్పుడల్లా తన పిల్లలతో అక్కడే టైం స్పెండ్ చేసేందుకు అన్ని రకాలుగా ఆ విల్లాను తీర్చిదిద్దారట. బీచ్ వ్యూ ఉండేలా, అటు ఎకో ఫ్రెండ్లీగ, ఇకీ స్మార్ట్ టెక్నాలిజీతో చాలా విలాసవంతంగా ఉందట ఈ విల్లా..! అంతేకాదు ఈ విల్లా రిజిస్ట్రేషన్ పనుల మీదే తాజాగా దుబాయ్‌ వెళ్లారట మహేష్ అండ్ ఫ్యామిలీ. దీనికి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విల్లా ఖరీదు ఎంతనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. విల్లా ఉన్న ప్రాంతం, బిల్డర్ కు ఉన్న పాపులారిటీని బట్టి చూస్తే మహేశ్ బాబు.. ఈ విల్లా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

దుబాయ్
దుబాయ్

స్టార్ హీరోస్ ఇండియాలోని వివిధ ఆస్తులపై పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సాధారణమే. కానీ విదేశాల్లోని ఆస్తులపై పెట్టుబడి పెట్టడం అనేది ఇటీవల ట్రెండవ్వుతోన్న సరికొత్త సంప్రదాయం. హిందీ, మలయాళ నటీనటులు ఇప్పటికే దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కొందరు క్రీడాకారులు కూడా అక్కడ కోట్లు విలువ చేసే విల్లాలను కొనుగోలు చేశారు. చెప్పాలంటే.. మన ఇండియాలో ప్రతి సెలబ్రిటీ అక్కడ ఏదో ఒక చోట ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నటీనటులతో పోల్చితే.. టాలీవుడ్ నుంచి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీలు చాలా తక్కువే. అందుకే, మహేష్ బాబుకు అక్కడ విల్లాను కొనుగోలు చేస్తున్నరనే సమాచారం అంతగా వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here