Mahesh Babu : మాస్ లుక్ తో పూనకాలు రప్పించిన మహేష్ బాబు.. వచ్చే సంక్రాంతికి అన్నీ రికార్డ్స్ బద్దలే

- Advertisement -

Mahesh Babu : సౌత్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే అది మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా మంచి క్లాసిక్ చిత్రాలు అని మాత్రం అనిపించుకున్నాయి.అందుకే వీళ్ళ కాంబినేషన్ కి మార్కెట్ లో అంత క్రేజ్ ఉంటుంది.

Mahesh Babu
Mahesh Babu

సెట్స్ మీద ఉండగానే వందల కోట్ల రూపాయిలు బిజినెస్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఈమధ్య కాలం లో రాకపోవడం పై ఫ్యాన్స్ బాగా నిరాశకి గురయ్యారు.అలా నిరాశకి గురైన ఫ్యాన్స్ కి నేడు నాగ వంశీ ఒక అదిరిపొయ్యే అప్డేట్ ఇచ్చాడు.మాస్ లుక్ తో సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా నడిచి వస్తున్న మహేష్ ఫోటో ని అప్లోడ్ చేసి జనవరి 13 వ తారీఖున సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు.

AMaravati movie

సంక్రాంతి కి మహేష్ అంటే ఇష్టమో, లేదా మహేష్ కి సంక్రాంతి అంటే ఇష్టమో తెలియదు కానీ, ఇప్పటి వరకు మహేష్ విడుదల చేసిన సినిమాలలో అధిక శాతం సంక్రాంతి కానుకగా విడుదలైనవే ఉన్నాయి.వాటిల్లో సూపర్ హిట్ అయ్యినవే ఎక్కువ, అలాగే 1 నేనొక్కడినే లాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఆయన చివరిసారిగా సంక్రాంతి కి ‘సరిలేరు నీకెవ్వరూ‘ సినిమాతో మన ముందుకి వచ్చాడు.

- Advertisement -

ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. సుమారుగా 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈసారి కూడా అదే రేంజ్ హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.ఈ చిత్రానికి ‘అటు అమరావతి ఇటు..’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ టైటిల్ ని కూడా ప్రకటించబోతున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here