Mahesh Babu : పూజా హెగ్డేతో మహేష్ బాబు సీక్రెట్ షాపింగ్.. లీకైన పిక్



Mahesh Babu : సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూడోసారి రూపొందుతోన్న చిత్రం వ‌ర్కింగ్ టైటిల్‌ SSMB 28. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా తాజాగా మరో షెడ్యూల్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, సెట్స్ నుంచి పలుమార్లు ఫొటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. దీంతో మహేశ్ లుక్స్, గెటప్, లోకేషన్లకు సంబంధించిన వివరాలు ముందుగానే తెలిసిపోతున్నాయి.

Mahesh Babu
Mahesh Babu

ఇది ఒక రకంగా చిత్ర యూనిట్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని ఫొటోలు లీకై నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. లేటెస్ట్ పిక్ లో మహేశ్ బాబు గ్రీన్ చెక్స్ షర్ట్ లో కనిపిస్తున్నాడు. బాబు పక్కనే ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ పూజా హెగ్దేకు సీన్ వివరిస్తున్నారు. పూజా రెడ్ లెహంగా వోణీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. వారి చుట్టూ అన్ని క్యాస్ట్యూమ్స్ కనిపిస్తుండటం చూడవచ్చు. ఏదేమైనా ఈ లీకులు మాత్రం ఫ్యాన్స్ కు మంచి కిక్ ను ఇస్తున్నాయి.

Actor Mahesh Babu
Actor Mahesh Babu

ప్ర‌స్తుతం SSMB 28 షెడ్యూల్‌ను హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీక‌రిస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ విష‌యంలోనూ మాత్రం మ‌హేష్ ఫ్యాన్స్‌కి వెయిటింగ్ త‌ప్పేలా లేదు.. ఏప్రిల్ 28న అని ముందుగా అనుకున్న సినిమా కాస్త‌.. ఆగ‌స్ట్ 11కి వెళ్లింది. ఇప్పుడు మాత్రం వ‌చ్చే సంక్రాంతికి అని అంటున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఈ సినిమా కోసం సూప‌ర్‌స్టార్ సిక్స్ ప్యాక్ లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు.