Mahesh Babu : ‘అమ్మవడి’ కి జై కొడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇదెక్కడి ఖర్మ అంటున్న ఫ్యాన్స్!

- Advertisement -

సూపర్ స్టార్ Mahesh Babu – త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా రాకపోవడం పై అభిమానులు తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తపరిచారు.

Mahesh Babu
Mahesh Babu

ముఖ్యంగా షూటింగ్ ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా కూడా టైటిల్ ప్రకటించకపోవడం పై మేకర్స్ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదురుకుంటున్నారు.ఈ ఉగాదికి టైటిల్ తెలుస్తాడని అనుకున్నారు కానీ అది జరగలేదు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్స్ పై అనేక వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యింది.పలు టైటిల్స్ ఫ్యాన్స్ ని ఆకర్షించాయి కూడా.కానీ రీసెంట్ గా సోషల్ మీడియా లో ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

Mahesh Babu Trivikram

ఆ టైటిల్ ఏమిటంటే ‘అమ్మవడి’ అట.మూవీ కథా మరియు కథనం మొత్తం అమ్మ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, ఈ చిత్రానికి అమ్మవడి అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని మహేష్ బాబు అభిప్రాయ పడ్డాడట. త్రివిక్రమ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.’అమ్మవడి’ అనే పేరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రవేశ పెట్టిన పథకాలలో ఒకటి.

- Advertisement -
Mahesh Babu Trivikram Movie

ఈ పథకం కి మంచి ఆదరణ కూడా దక్కింది. అయితే ఆ పేరునే మూవీ టైటిల్ గా పెట్టడం పై ఫ్యాన్స్ కాస్త అభ్యంతరం వ్యక్త పరుస్తున్నారు. ఎందుకంటే ఈ టైటిల్ చాలా క్లాస్ గా ఉంది, మహేష్ బాబు లాంటి స్టార్ కి ఇలాంటి టైటిల్స్ సరిపడవు అని, ఆయన స్టార్ ఇమేజీకి తగట్టుగా టైటిల్ ని పెట్టాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మేకర్స్ ఫ్యాన్స్ కోరినట్టు చేస్తారా.?, లేదా అనేది మహేష్ చివరి నిర్ణయం పై ఆధారపడి ఉంది

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here