Guntur Karaam : సంక్రాంతి వచ్చిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు విడుదల అవ్వడం చాలా కామన్ అయిపోయింది. నేటి తరం స్టార్ హీరోలలో అత్యధికంగా సంక్రాంతికి సినిమాలను విడుదల చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సీజన్ లో ఆయన తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. వచ్చే సంక్రాంతికి ఆయన ‘గుంటూరు కారం’ చిత్రం తో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉండడం తో రెండు మూడు యూనిట్స్ తో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు ప్రస్తుతం మూవీ యూనిట్. ఇందులో మహేష్ బాబు ని ఇప్పటి వరకు చూడనంత మాస్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించబోతున్నాడు అని తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ పై అభిమానులు చాలా అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. టీజర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ తర్వాత విడుదల చేస్తున్న పోస్టర్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా కాస్త రొటీన్ గా అనిపించింది. ప్రతీ పోస్టర్ లోను మహేష్ చేత బీడీ పట్టించడం కామన్ అయిపోయింది.

ఎంత మాస్ అయితే మాత్రం, మరీ ఈ రేంజ్ లో హీరో చేత బీడిని కాల్పించాలా?. ఈ సినిమాకి ‘గుంటూరు కారం‘ అని కాకుండా ‘గుంటూరు బీడీ’ అని టైటిల్ పెట్టి ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది అంటూ సెటైర్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం లో మహేష్ పాటల్లో తప్ప, మిగిలిన అన్ని సన్నివేశాల్లో బీడీతోనే కనిపిస్తాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
