Mahesh Babu : టెన్షన్ లో మహేష్ బాబు.. పాపం ఎంత కష్టపడినా.. గుంటూరు కారం సాంగ్ లీకైందిగా..

- Advertisement -

Mahesh Babu : ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Mahesh Babu
Mahesh Babu

త్రివిక్రమ్ బర్త్ డే… నవంబర్ 7కు సాంగ్ ప్రోమో లేదా సాంగ్ విడుదల తేదీ ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే… ఇంతలో సోషల్ మీడియాలో ఓ సాంగ్ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. వరుస విజయాలతో మంచి జోరులో ఉన్న సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ ‘గుంటూరు కారం’లో ఓ సాంగ్ పాడారు. అదే ‘మసాలా బిర్యానీ’. ఆ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే… ‘గుంటూరు కారం’ నుంచి విడుదల అయ్యే ఫస్ట్ సాంగ్ ఇది కాదని సమాచారం.

తొలుత ఈ పాటను విడుదల చేయాలని ప్లాన్ చేసినా… ఎందుకో విరమించుకున్నారట! ఇప్పుడు మెలోడీ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేస్తారని టాక్. లీకైన ‘మసాలా బిర్యానీ’ తర్వాత వస్తుందని చెబుతున్నారు. ‘మసాలా బిర్యానీ’ మీద సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినబడుతున్నాయి. కొందరు బావుందని పోస్ట్ చేస్తుంటే… మరి కొందరు సాంగ్ బాలేదని కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here