Madhavi Latha : ఇది ఫోటో కాదు.. జ్ఞాపకం.. కన్నీరు పెట్టిస్తున్న మాధవిలత పోస్ట్..

- Advertisement -

Madhavi Latha : రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్చావులే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది మాధవిలత.. ఈ సినిమా మంచి విజయం అందుకుంది అంతకుముందు మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్గా స్నేహితురాలిగా నటించింది. ఇక ఆ తరువాత నాని సరసనా స్నేహితుడా అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఇవేమీ పెద్దగా విజయాన్ని ఇవ్వలేదు.. లేడీ సినిమాతో కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది. తాజాగా మాధవి లతా పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Madhavi Latha
Madhavi Latha

సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏ విషయాన్ని పంచుకున్న అది క్షణాల్లో వైరల్ అవుతాయి. అయితే మాధవి లత పెట్టే పోస్టులు చేసే విమర్శలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నెగటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. మరి కొన్నిసార్లు నెటిజన్స్ చేత నెగటివ్ కామెంట్స్ ను ఎదుర్కొంటుంది. తాను కూడా అవతలి వారికి స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తుంది. మాధవి లతకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తను ఏదైనా పోస్ట్ చేస్తే అది కొన్ని క్షణాల్లోనే వైరల్ అవుతుంది.

తాజాగా మాధవి లత తన ఇన్ స్టాగ్రామ్ లో లవర్ బాయ్ గా అందరి మనసులు దోచుకున్న హీరో ఉదయ్ కిరణ్ తను కలిసి ఉన్న ఓ ఫోటో ను షేర్ చేసింది.

- Advertisement -
madhavi latha share a throwback photo on uday kiran
madhavi latha share a throwback photo on uday kiran

ఇది ఫోటో కాదు జ్ఞాపకం.. మనం ఎన్ని కష్టాలను పడ్డా కూడా ఆ జ్ఞాపకాలను మరచిపోకూడదు. మసక బారిపోయిన మన కళ్ళకి జ్ఞాపకాలతో మరోసారి వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ఈ జ్ఞాపకాలు పనికొస్తాయి. ఈ జ్ఞాపకం ఎప్పటికీ హృదయంలో నిలిచిపోతుంది త్రో బ్యాక్ ఫొటోస్ లో ఉదయ్ కిరణ్ ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో మాధవి లత ఉదయ్ కిరణ్ హల్చల్ చేస్తుంది.

ఈ ఫోటోపై మిస్ యు ఉదయ్ కిరణ్ అన్న అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి ఫోటో పెట్టి మళ్ళీ ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకుని ఇలా చేశావు అంటూ మాధవి లతకు థాంక్స్ చెబుతున్నారు నెటిజన్స్. ఉదయ్ కిరణ్ ను జ్ఞాపకాలలో చూసుకుంటూ ఆయన అభిమానులు ఆయనను మరవలేక పోతున్నారు. స్టార్ హీరో లాగా వెలుగొందాల్సిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కానీ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకొని వెళ్ళిపోయారు ఉదయ్ కిరణ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here