Madhavi Latha : నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధవి లత ఆ తరువాత మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగు హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారని.. దర్శక, నిర్మాతలు చెప్పినట్లు వినాలని అప్పుడే ఆఫర్స్ వస్తాయంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయ్యింది.
తాను హీరోయిన్‌గా ప్రయత్నిస్తున్న టైం ఓ కోఆర్డినేటర్ ఫోన్ వచ్చింది. హీరోయిన్‌గా నటించేందుకు మంచి ఆఫర్ ఉంది. కాకపోతే చాలా కమిట్మెంట్‌తో ఉండాలని ముందుగా తనతో ఒక రాత్రి గడిపితే నీ ఫిగర్ గురించి నిర్మాతలకు చెబుతా అంటూ పిచ్చిగా మాట్లాడాడు. ఆ తరువాత నాకు విషయం అర్థమై అతని ఫోన్ కట్ చేశా అన్నారు. ఇక ఆ తరువాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని నిర్మాతలు, కోఆర్డినేటర్లు డైరెక్ట్‌గా ఫోన్ చేసి నైట్ ఫ్రీనా అని అడిగేవారంటూ వాపోయింది.
మాధవి లత సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా రాజకీయ నాయకురాలుగా సినీ నటిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది మాధవి లత.ఇది ఇలా ఉండే తాజాగా మాధవీలత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.