Love marriages : ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న తెలుగు స్టార్ హీరోలు వీళ్లే..!!

- Advertisement -

Love marriages : ఈరోజు ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే.. ఫిబ్రవరి 14..ప్రేమికుల దినోత్సవం ఎంతోమందికి ఈరోజు ఒక పండగ లాంటిది. చాలామంది ప్రేమికులు ఈరోజు వారి హోదాకి తగ్గట్టు గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక అలాంటి ప్రేమికుల రోజు ప్రేమికులకు చాలా ప్రత్యేకం. ఇదిలా ఉంటే మన సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎంతమంది ఉన్నారో వాలెంటైన్స్ డే స్పెషల్ లో తెలుసుకుందాం..

Love marriages
Love marriages

కృష్ణ-విజయనిర్మల : కృష్ణ మొదట ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాక విజయ నిర్మలని ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు..

నాగార్జున-అమల: అక్కినేని నాగార్జున మొదట దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

- Advertisement -

అజిత్-శాలిని : ఈ కోలీవుడ్ జంట కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక శాలిని తన కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే కేవలం 21 సంవత్సరాల వయసులోనే అజిత్ ని పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది..

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నాడు.కానీ వీరి పెళ్లికూడా ఎన్నో రోజులు నిలవలేదు. ఆమెకు విడాకులు ఇచ్చి మూడవ పెళ్లి కూడా చేసుకున్నాడు.

మహేష్- నమ్రతా: మహేష్ నమ్రత కూడా వంశీ సినిమాలో నటిస్తున్న టైం లో ప్రేమలో పడి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. చిలకా, గోరింకలాగా ఉంటూ అందరికి ఆదర్శముగా ఉన్నారు..

శ్రీకాంత్-ఊహ : ఈ జంట కూడా సినిమాల్లో నటిస్తున్న టైం లో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఇప్పటికీ వాళ్ళు కలిసే ఉంటున్నారు.. వీరికి పిల్లలు కూడా ఉన్నారు.

అల్లు అర్జున్-స్నేహ రెడ్డి: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఒక పార్టీలో కలిసిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

నాగ చైతన్య-సమంత : ఏ మాయ చేసావే సినిమా టైంలో ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు గడవకముందే విభేదాల కారణంగా విడిపోయారు.
కేవలం ఈ జంటలే కాకుండా ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here