Ram Charan : బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తో అదిరిపోయే స్టెప్పులేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..

- Advertisement -

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్.. తన నటనతో పాటు డాన్స్ లో కూడా ఇరగతీస్తాడనడంలో సందేహమే లేదు.. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్తెప్పులేసిన నాటు నాటు సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది అంటే అతిశయోక్తి కాదు.. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమా షూటింగ్ లో ఉన్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూట్ కి సంబంధించి ఓ పాట షూట్ జరుగుతుంది. ఈ పాటకి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు.. అయితే ఈ పాట షూట్ గ్యాప్ లో ఆచార్య మాస్టర్ తో కలిసి రామ్ చరణ్ ఓల్డ్ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్పులు వేశారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Ram Charan

అక్షయ్ కుమార్ సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన మైన్ ఖిలాడీ తు అనారి సినిమాలోని పాపులర్ సాంగ్ మైన్ ఖిలాడీ టు అనారికి రామ్ చరణ్ గణేష్ మాస్టర్ కలిసి స్టెప్పులు వేశారు. రామ్ చరణ్, గణేష్ ఆచార్య మాస్టర్ ఈ పాటకి రిల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఇలా స్టెప్స్ వేస్తూ రియల్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ వారసత్వాన్ని డాన్స్ లో కూడా పూర్తిగా తీసుకుని తన స్టెప్పులతో అభిమానుల్ని మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్.

Ganesh Acharya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ కలిసి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దాంతో ఓల్డ్ హిట్ సాంగ్ కే వీళ్ళిద్దరూ కలిసి స్టెప్పులు వేస్తే ఇలా ఉందంటే.. ఇక గణేష్ మాస్టర్ నేతృత్వంలో RC 15 సినిమాలో వచ్చే సాంగ్స్ స్టెప్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు అంటూ ఈ వీడియోని వైరల్ చేసే పనిలో పడ్డారు మెగా ఫాన్స్.

- Advertisement -

RC 15 సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రభినయం చేస్తున్నరని సమాచారం. ఇందులో ఒక పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఈరోజు ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. ఇక రెండో పాత్ర ప్రజెంట్ జనరేషన్ లో కనిపిస్తుంది. ఇది ఎన్నికలు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ నటించిన ఇదే తొలిసారి. ఈ సినిమాలో శంకర్ ఎలాంటి పాయింట్ను టచ్ చేస్తాడో చూడాలి మరి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here