Lip Kiss : ఒకప్పుడు సినిమాల్లో కేవలం చూపులతోనే రొమాన్స్ చేసేవారు..ఆ తర్వాత టచింగ్ లతో..అది రాను రాను లిప్ కిస్ ల వరకూ వెళ్ళింది..సినిమాల ద్వారానే లిప్ కిస్ అనేది వెలుగులోకి వచ్చింది..నిజానికి అది వెస్టర్న్ కల్చర్. కానీ.. ఆ తర్వాత ఆ కల్చర్ మన దేశానికి కూడా పాకింది.హీరో, హీరోయిన్ల రొమాన్స్ కు తొలి మెట్టు లిప్ కిస్సే. అప్పట్లో స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు.., లిప్ కిస్ ఇవ్వడానికి మొహమాట పడేవారు. కొందరైతే నిర్మొహమాటంగా ఇవ్వం అని చెప్పేవారు. కానీ.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరో, హీరోయిన్లు మాత్రం మూతులు నాకడంలో ఏమాత్రం మొహమాట పడరు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి సినిమాలో లిప్ కిస్ అనేది కామన్..
అప్పుడే 35 ఏళ్ల కింద దయావన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా 1988 లో వచ్చింది. వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఫిరోజో ఖాన్ దర్శకత్వం వహించాడు. స్టార్ హీరోయిన్లు కూడా లిప్ కిస్ కు ఓకే చెప్పేస్తున్నారు. స్టార్ కిడ్స్ కూడా లిప్ కిస్ కు ఓకే చెబుతున్నారు. వాళ్లే కాదు.. పెళ్లయిన హీరోయిన్లు కూడా రొమాన్స్ కు, లిప్ కిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.అప్పుడే అది ఘాటు కిస్..అప్పటి నుంచి అక్కడ అదే ట్రెండ్ అయ్యింది.
మాధురీ దీక్షిత్ స్టార్ హీరోయిన్. తనకు ఉన్న రేంజే వేరు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది. అయినా కూడా వినోద్ ఖన్నాకు లిప్ కిస్ ఇచ్చేసింది మాధురీ దీక్షిత్. నిజానికి తనకు వినోద్ ఖన్నాకు లిప్ కిస్ ఇవ్వడం ఇష్టం లేదట. కానీ.. తనకు కోటి రూపాయలు కేవలం లిప్ కిస్ ఇస్తే ఇస్తామని చెప్పడంతో మాధురి ఓకే చెప్పేసిందట. నిజానికి ఆసమయంలో కోటి రూపాయలు తీసుకునే నటుడు కేవలం అమితాబ్ బచ్చన్ మాత్రమే.అప్పుడే కోటి రూపాయలు అంటే ఇప్పుడు 25 కోట్లు పై మాటే ..అందుకే అది ఇండియా సినీ చరిత్రలోనే ఖరీదైన కిస్..మాధురి దీక్షిత్ ఆ రికార్డును సొంతం చేసుకుంది..