Besharam Rang : షారుఖ్ అక్కడ చేయి పెట్టాడేంటి.. ‘బేషరమ్ రంగ్’ సాంగ్ పై నెట్టింట ట్రోల్స్

- Advertisement -

Besharam Rang : సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలది ప్రత్యేక స్థానం. సౌందర్య – వెంకటేశ్, చిరంజీవి – రాధిక, నాగార్జున – టబు బాలీవుడ్ లో అయితే అమితాబ్ బచ్చన్ – రేఖ, షారుఖ్ – కాజోల్, వరుణ్ ధావన్ – ఆలియా భట్.. ఇలా కొన్ని జంటలు తెరపై చేసే మ్యాజిక్కే వేరు. ఆ జంటల్లో మరో క్రేజీ జంట చేరింది. అదే షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొణె. వీళ్లిద్దరు కలిసి ఇప్పటికే ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలు చేశారు. ఇప్పుడు వీరు కలిసి నటిస్తున్న మరో సినిమా పఠాన్. ఈ మూవీ ఈ జంటకు సంబంధించి ఓ పాట ఇటీవలే రిలీజ్ అయింది. అదే ‘బేషరమ్ రంగ్ సాంగ్. 

Besharam Rang
Besharam Rang

ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ‘బేషరమ్‌ రంగ్‌’ సాంగ్‌దే హవా. షారుఖ్‌ఖాన్‌, దీపిక పదుకొణె కీలక పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ . ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘బేషరమ్‌ రంగ్‌’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేసింది.

ఈ పాటలో దీపిక అందాలు, షారుఖ్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద పసుపు రంగు బికినీలో దీపిక పదుకొణె డ్యాన్స్‌ చేస్తుంటే యువత మతిపోతోంది. ఈ పాట యూట్యూబ్‌లో విడుదల చేసిన దగ్గరి నుంచి  దీపిక అందాలను, పాట పాడిన వారిని పొగుడుతూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. విశాల్‌-శేఖర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటను కుమార్‌ రాయగా, శిల్పా రావ్‌, కార్లిసా మాంట్రియా, విశాల్‌, శేఖర్‌లు ఆలపించారు. యువతను ఉర్రూతలూగిస్తున్న ఆ పాటను మీరూ చూసేయండి.

- Advertisement -

ఇక ఈ పాటలో దీపిక బికినీలో కనిపించింది. ఎల్లో, ఆరెండ్, గోల్డెన్ బికినీల్లో దీపిక అందాలు చూసి కుర్రాళ్ల మతిపోతోంది. ఈ సాంగ్ లో బికినీలో కనిపించడానికే దీపిక రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట. దీపిక బికినీ ట్రీట్ కుర్రకారుకు పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. ఇక చాలా మంది ఈ పాటలో దీపిక – షారుఖ్ ల కెమిస్ట్రీని అభినందిస్తుండగా మరికొందరు మాత్రం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. 

ఈ సాంగ్ లో దీపిక సూపర్ హాట్ లుక్స్, అమేజింగ్ డాన్స్ మూవ్మెంట్స్ ..కనురెప్ప వెయ్యనియ్యకుండా చేస్తున్నాయి. అయితే అదే సమయంలో షారుఖ్ ఖాన్ .. పాట చివర్లో ఆమె హాఫ్ బికినీ పై చెయ్య పెట్టడం నచ్చలేదని, ఫ్యామిలీలతో మీ సినిమా చూడలేమంటూ ట్రోల్ చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ సినిమాలో ఇలాంటి వల్గారిటీని ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటపై  కాస్త నెగిటివిటీ స్టార్ట్ అయింది. మరి కొంత మంది యూట్యూబ్ లో ఆ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ట్విటర్ లో రచ్చ అయితే మామూలుగా లేదు. 

ఈ సాంగ్ లో దీపికా అందాల ఆరబోత ..షారుఖ్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి. స్పెయిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా చిత్రీకరించిన ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here