Allari Naresh : అల్లరి నరేశ్​కు అన్యాయం.. ఆ బడా ప్రొడ్యూసర్లదే పాపం..!

- Advertisement -

ప్రముఖ డైరెక్టర్​ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు Allari Naresh. చేసిన మొదటి సినిమా అల్లరినే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఇక ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. కామెడీ సినిమాలతో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కామెడీ టైమింగ్​తో అమాయకత్వంతో అభిమానుల మనసు దోచుకున్నాడు. నరేశ్​కు కామెడీ కన్నా.. మంచి నటుడు అనిపించుకోవాలన్న కోరిక ఎక్కువ. అందుకే నటనకు ఆస్కారమున్న ఏ పాత్ర వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఆ పాత్ర నిడివి 10 నిమిషాలున్నా పట్టించుకోడు.. కంటెంట్ ఉంటే చాలంటూ ఓకే చెప్పేస్తాడు.

అందుకే గమ్యంలో గాలిశీను.. మహర్షిలో రవి పాత్రలతో ప్రేక్షకుల మదిలో చిరకాల ముద్ర వేశాడు. ప్రస్తుతం ఓ సీరియస్ కంటెంట్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఏ ఆర్ మోహన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ట్రైలర్​ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్​కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా నరేశ్ కెరీర్​లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Allari Naresh
Allari Naresh

 

- Advertisement -

ఈ మూవీని నవంబర్ 25వ తేదీన థియేటర్​లలో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమాకు థియేటర్స్ చాలా తక్కువ కేటాయిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం దిల్ రాజు, అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న డబ్బింగ్ సినిమాలు ఈ వారం రిలీజ్ కావటమే.

దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న #LoveToday సినిాకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. అలాగే అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తోడేలు #Thodelu కు కూడా అత్యధిక థియేటర్స్ లభించాయి. కానీ స్ట్రైయిట్ తెలుగు సినిమా అయిన అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”కు మాత్రం ఆ స్దాయిలో థియేటర్స్ దొరకలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై భారీగా చర్చ జరుగుతోంది. డబ్బింగ్ సినిమాలకు ఇచ్చిన ప్రియారిటీ స్ట్రైయిట్ తెలుగు సినిమాకు ఇవ్వకపోవటమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్​ సర్కిల్​లో ఇదే హాట్ టాపిక్.

తనను ఒకప్పుడు అందరూ ‘బాగా నటించావ్‌’ అని చెప్పేవారని, ఇప్పుడు ‘అందంగా ఉన్నావ్‌’ అని అంటున్నారని అల్లరి నరేశ్‌ అన్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ “ఈ సినిమా ముందు వరకు అందరూ నన్ను బాగా చేశావ్‌ అని చెప్పేవారు. ఈ సినిమా విషయంలో ‘నువ్వు అందంగా ఉన్నావ్‌’ అని అంటున్నారు. అలా చెబుతుంటే నాకు సిగ్గేస్తోంది. నన్ను రాంరెడ్డి అంత బాగా చూపించారు. ఈ సినిమాలో భాగమై, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అన్ని భాషల్లో చేయదగ్గ సినిమా ఇది. దక్షిణాదిలో హిట్‌ అందుకున్నాక ఉత్తరాదిలోనూ ఈ సినిమాని దర్శకుడు మోహనే తెరకెక్కించాలని కోరుకుంటున్నా” అని నరేశ్ అన్నారు.

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న మరొక చిత్రం ఉగ్రమ్. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తున్నారు. నాంది సినిమా తర్వాత మళ్లీ ఈ కాంబోలో వస్తోన్న మూవీ ఇది. ఈ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here